ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలి

ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలి అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ రాజన్న సిరిసిల్ల జిల్లా :కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీలు చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు.ధాన్యం సేకరణ, ట్యాబ్ ఎంట్రీలు ఇతర అంశాలపై అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని తన ఛాంబర్లో పౌర సరఫరాల శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

 Tab Entries Should Be Made From Time To Time For Grain Purchase Details , Collec-TeluguStop.com

ఈ సందర్భంగా ఐకేపీ, డీసీఎంఎస్, ప్యాక్స్, మెప్మా వారి ఆద్వర్యంలో ఇప్పటి దాకా సేకరించిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఆయా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం సేకరించిన వెంటనే వాటి వివరాలను ట్యాబ్ ఎంట్రీ చేయాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సూచించారు.

నాణ్యతా ప్రమాణాలు మేరకు ధాన్యం తీసుకువచ్చిన రైతుల నుంచి నిబంధనల ప్రకారం తూకం వేయాలని ఆదేశించారు.ధాన్యం డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడేలా చూడాలని పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలు వివరాలు ట్యాబ్ ఎంట్రీ చేయని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఐకేపీ, డీసీఎంఎస్, ప్యాక్స్, మెప్మా ల ఆద్వర్యంలో ఇప్పటి దాకా 11,946 మంది రైతుల నుంచి 80,827 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు.మొత్తం రూ.84 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేశామని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తెలిపారు.సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి జితేంద్ర ప్రసాద్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube