విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకే కంప్యూటర్ చాంప్స్

మన ఊరు – మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులు పూర్తి చేయాలి స్వచ్ఛ సర్వేక్షన్ పై ప్రజలకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల జిల్లా : విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, అవగాహన పెంపొందించేందుకే కంప్యూటర్ చాంప్స్ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగిందని, విద్యార్థులకు కంప్యూటర్ తరగతులు క్రమం తప్పకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( anurag jayanthi ) ఆదేశించారు.మంగళవారం ఆయన చందుర్తి మండలం కేంద్రం, మల్యాల గ్రామంలో పర్యటించి హరితహారం ప్లాంటేషన్, మన ఊరు-మన బడి కార్యక్రమంలో చేపడుతున్న పనుల పురోగతి, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ షెడ్ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

 Computer Champs To Increase Technology Knowledge Among Students , Technology Kno-TeluguStop.com

మొదటగా మల్యాల గ్రామ శివారులో రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఎన్ని మొక్కలు నాటారు.? మొక్కల సంరక్షణ ఎలా చేపడుతున్నారు అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.గత సంవత్సరం 1,200 మొక్కలు నాటామని, కిలో మీటరుకు ఒక వాచ్ అండ్ వార్డు చొప్పున ముగ్గురిని నియమించామని గ్రామ పంచాయితీ కార్యదర్శి వివరించారు.

ఎక్కడైనా మొక్కలు చనిపోయి ఉంటే వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలని కలెక్టర్ సూచించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మల్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మన ఊరు ; మన బడి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.20 లక్షల రూపాయలతో విద్యుత్ సరఫరా, డ్రింకింగ్ వాటర్, మేజర్, మైనర్ రిపేర్ పనులు, డైనింగ్ హాల్ పనులు చేపడుతున్నట్లు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు కలెక్టర్ కు వివరించారు.ఇందులో విద్యుత్ పనులు పూర్తికాగా మేజర్, మైనర్ రిపేర్ పనులు చివరి దశలో ఉన్నాయని, డైనింగ్ హాల్ నిర్మాణానికి ఇంకా నిధులు మంజూరు కావాల్సి ఉందని అన్నారు.

ఈజీఎస్ లో భాగంగా 3 లక్షల రూపాయలతో చేపట్టిన టాయిలెట్లు నిర్మాణం చివరి దశలో ఉందని తెలిపారు.సాధ్యమైనంత త్వరగా పనులన్నీ పూర్తిచేసి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల తీరును కలెక్టర్ పరిశీలించారు.కంప్యూటర్ చాంప్స్ కార్యక్రమంలో భాగంగా కంప్యూటర్ తరగతులు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అనే వివరాలను కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం, అవగాహన పెంపొందించేందుకే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని కలెక్టర్ అన్నారు.క్రమం తప్పకుండా కంప్యూటర్ తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయుడిని ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా 60 పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమ అమలు తీరును జిల్లా విద్యాధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.తదనంతరం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు.

పాఠశాలలో 2 లక్షల రూపాయలతో విద్యుత్ సరఫరా, మేజర్, మైనర్ రిపేర్ పనులు పూర్తి చేసి, ప్రారంభించడం జరిగిందని కలెక్టర్ కు అధికారులు వివరించారు.స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా కేంద్ర బృందం పర్యటనకు సర్వసన్నద్ధంగా ఉండాలని అన్నారు.

గ్రామంలోని ప్రజలందరికీ తడి, పొడి చెత్త నిర్వహణ, స్వచ్ఛ సర్వేక్షన్ కు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించాలని సర్పంచ్ ను, గ్రామపంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.అలాగే పీఎంఎఫ్ఎంఈ పథకంలో భాగంగా ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ గురించి అవగాహన కల్పించి జీవనోపాధి అందించే యూనిట్లను ఏర్పాటు చేసుకునేలా చూడాలని సూచించారు.

దీనిపై ఐకెపి సీసీ లతో సమావేశం నిర్వహించాలని ఎంపీడీఓ ను కలెక్టర్ ఆదేశించారు.చివరగా కలెక్టర్ చందుర్తి మండల కేంద్రంలో స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ షెడ్ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ ముఖ్యమైన అంశమని అన్నారు.గ్రామాల నుండి వచ్చే వ్యర్థాలు కలెక్షన్ చేసుకోవడానికి ఏ గ్రామం నుండి ఏరోజు రావాలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు.

రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని ఆదేశించారు.ఈ షెడ్ నిర్వహణను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కు అనుసంధానం చేయాలన్నారు.

షెడ్ లో పేర్లు రాయాలని ఏఈ కి సూచించారు.ఇక్కడ సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను జిల్లా కేంద్రంలోని డీఆర్సీసీ కేంద్రానికి, ఏజెన్సీలకు విక్రయించాలని అన్నారు.

ఈ సందర్శనలో జిల్లా విద్యాధికారి ఏ.రమేష్ కుమార్, పంచాయితీ రాజ్ ఈఈ సూర్య ప్రకాష్, అడిషనల్ డీఆర్డీఓ మదన్ మోహన్, ఎంపీడీఓ రవీందర్, తహశీల్దార్ మజీద్, ఏపీడీ నర్సింహులు, ఎంపీఓ ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube