రాజన్న సిరిసిల్ల జిల్లా : గత కొన్ని రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట( Gambhiraopet ) మండలంలోని గోరంటాల గ్రామం నుండి వచ్చే వాగు ప్రవాహం వల్ల మల్లుపల్లి రహదారి పూర్తిగా ధ్వంసమై వరి నాటు వేసినటువంటి పంట పొలాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.అలాగే మల్లుపల్లె గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయన్నారు.
ప్రతి సంవత్సరం కురుస్తున్నటువంటి వర్షాలకు ఇదే రకంగా రహదారి కొట్టుకపోవడం రైతులకు నష్టం జరుగుతూనే ఉందని నేను అభివృద్ధి చేశాను అని సంకలు గుద్దుకునే మంత్రి దీనిపైన మీ చిత్తశుద్ధి ఏమైందని అని శనివారం భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రేడ్డబోయిన గోపి ( Reddaboina Gopi ) ఎద్దేవా చేశారు.ఈ మల్లుపల్లె గ్రామం మీ నియోజకవర్గంలో లేదా మల్లుపల్లె ప్రజలు మీకు ఓటు వేయడం లేదా ఎందుకు దీనిపై మీరు స్పందించడం లేదు అని ఆయన డిమాండ్ చేశారు.
వెంటనే పనులు చేపట్టి అవసరం మేరకు బ్రిడ్జి నిర్మాణం చేసి గోరంటాల వాగుకు రెండు ప్రక్కల సీసీ నిర్మాణం చేసి మల్లుపల్లె, గోరంటాల గ్రామానికి సంబంధించినటువంటి ప్రజల, రైతుల కష్టాలను వెంటనే నెరవేర్చాలని లేనియెడల ప్రజలు తరిమికొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంట అశోక్, సీనియర్ నాయకులు కొమ్మనపల్లి దేవయ్య, తంగళ్ళపల్లి ప్రధాన కార్యదర్శి రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి మహేష్,కిసాన్ మోర్చా అధ్యక్షులు రమేష్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మురళి గౌడ్,యువ మోర్చా అధ్యక్షులు విగ్నేష్ గౌడ్,మల్లుపల్లె కార్యకర్తలు మహేష్, రమేష్, గ్రామ రైతులు రాములు,బూదయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.