రాజన్న సిరిసిల్ల జిల్లా: సైబర్ మోసాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అప్రమత్తతతోనే సైబర్ మోసాలకు చెక్ పెట్టవచ్చు అని జిల్లా ఎస్పీ తెలిపారు.ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ నేరాలు జరుగు విదానం పట్ల అవగాహన ఉంటే చాలావరకు నేరాలను తగ్గించవచ్చు అని జిల్లా ఎస్పి తెలిపారు.
ఒక వ్యక్తికి ఏదైనా ఆశ చూపించి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తాయని అతని నుండి వ్యక్తిగత సమాచారం తీసుకుని సైబర్ నేరం చేయడం జరుగుతుంది.భయం ఏదైనా వ్యక్తికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ కానీ, పాన్ కార్డు కానీ, ఇతర అకౌంట్లు బ్లాక్ అవుతుందని భయపెట్టి వారి నుంచి వ్యక్తిగత సమాచారం తీసుకొని సైబర్ నేరం చేస్తున్నారు.కావున ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930, డయల్ 100 కి కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను చాలా వరకు తిరిగి పొందేలా చేయవచ్చు అని తెలిపారు.
జిల్లా పరిధిలో గతవారం రోజులలో నమోదు సైబర్ కేసుల వివరాలు:
● చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి అన్నం నెంబర్ నుంచి కాల్ వచ్చింది.ఆన్లైన్ మోసగాడు తాను దని పర్సనల్ లోన్ ఎగ్జిక్యూటివ్ నుంచి కాల్ చేస్తున్నానని మీకు 3 లక్షల లోన్ శాంక్షన్ అయిందని నమ్మించాడు.తద్వారా బాధితుల నుంచి లోన్ అప్రూవల్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు కోసం పలు దఫాలుగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు.
తద్వారా బాధితుడు 18,500/- నష్టపోయాడు.● సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆధితునికి గుర్తు తెలియని నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది, బాధితులు వాట్సప్ ద్వారా చాట్ చేసి సైబర్ నేరస్థులు పంపిన లింకును ఓపెన్ చేసి అందులో రిజిస్టర్ అయ్యారు గూగుల్ మ్యాప్స్ లో రెస్టారెంట్ కి రేటింగ్ ఇస్తే అమౌంట్ వస్తాయి అనగా అలానే చేశారు మొదట బాధితునికి కొంత అమౌంట్ వచ్చింది తర్వాత ఇంకా అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి అది మీకు బిట్కాయిన్ లో ట్రేడ్ చేస్తే ఇస్తాం అని భావితుడిని నమ్మించాడు అది నమ్మి బాధితుడు 26,000/- మోసపోయాడు. ● వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి అన్నోన్ నెంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది కేబీసీ లో మీ మొబైల్ నెంబర్ 25 లక్షలు గెలుచుకున్నాయి వాటిని పొందడానికి జీఎస్టీ చార్జెస్ పంపగలరని నమ్మించాడు తద్వారా బాధితుడు 7000/- నష్టపోయాడు. ● సిరిసిల్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి అన్నం నెంబర్ నుంచి కాల్ వచ్చింది.
ఆన్లైన్ మోసగాడు తాను దని పర్సనల్ లోన్ ఎగ్జిక్యూటివ్ నుంచి కాల్ చేస్తున్నానని మీకు 10 లక్షల లోన్ శాంక్షన్ అయిందని నమ్మించాడు.తద్వారా బాధితుల నుంచి లోన్ అప్రూవల్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు కోసం పలు దఫాలుగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు.
తద్వారా బాధితుడు 13,399/- నష్టపోయాడు.●ఎల్లారెడ్డి డిబేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు ఫేస్బుక్లో కెరీర్ అసిస్టెంట్ లోన్స్ ఇన్ ఇండియా అనే లోన్ ఆప్ ఆడ్ చూసి సస్పెక్ట్ ని వాట్సాప్ లో కాంటాక్ట్ చేశాడు.సైబర్ నేరగాడు బాధితునికి లోన్ ఇప్పిస్తాను అని చెప్పి ఆధార్ కార్డు డీటెయిల్స్ తీసుకొనివ్యక్తింకి లోన్ శాంక్షన్ అయినట్టుగా యాప్ లో చూపించి నమ్మించాడు తర్వాత ప్రాసెసింగ్ ఫ్రీ అని టాక్స్ అని పలు దఫాలుగా బాధితుల నుంచి 18,500 ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు.
తీసుకోవలసిన జాగ్రత్తలు:-
• మీకు లాటరి,లోన్ వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ?.ఆశపడకండి, అనుమానించండి.వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి.•అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చెయ్యకండి, చేస్తే వాళ్ళు నగ్నంగా ఉండి, మీకు చేసిన వీడియో కాల్ రికార్డు చేసి,మిమ్మల్ని బెదిరించి డబ్బులు లాగేస్తారు.•వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మకండి.•తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు.ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చెయ్యండి.•మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించండి.•”ఇంస్టాగ్రామ్” లో మీకు తెలిసిన వ్యక్తి ఫోటో వుండి మిమ్మల్ని డబ్బులు పంపమని అడుగుతున్నాడా? మరి ఆ మెసేజి మీకు తెలిసిన వ్యక్తే పంపాడా? తెలుసుకోండి, మోసపోకండి.•సోషల్ మీడియా లో ప్రకటనలు చూసి పెట్టుబడి పెట్టకండి, కొంచెం ఆగి ఆలోచించండి, అది సైబర్ మోసం కూడా కావచ్చు.•మీ ప్రమేయం లేకుండా మీకు ఓటీపీ వస్తే దాన్ని ఎవరికీ చెప్పకండి.
అది సైబర్ నేరగాళ్ల ఎత్తుగడ అయివుండవచ్చు.







