నేడు తెలంగాణ మంచి నీళ్ల పండుగ ను పురస్కరించుకొని ప్రత్యేక కథనం

రాజన్న సిరిసిల్ల జిల్లా: మిషన్ భగీరథ తెలంగాణ మంచి నీళ్ల పండుగ సందేశం (నాడు-నేడు) 120 ఎం.ఎల్.

 Special Article Celebrating Telangana Good Water Festival Today , Vemulawada , S-TeluguStop.com

డి, డబ్ల్యూ టి పి అగ్రహారం.నీరే జీవాధారం! నీరు లేకుంటే జీవనమే ప్రశ్నార్థకం.

తెలంగాణ రాస్త్రావతరణానికి పూర్వం త్రాగునీటి కోసం మహిళలు బిందెలతో సుదూర ప్రాంతాలకు వెళ్ళి నీటి సేకరణ కోసం ఇబ్బందులు పడటం సర్వసాదారణంగా వుండేది.ఇందువల్ల వారు త్రాగునీరు అనే ప్రాదమిక అవసరం కోసం వారి సమయాన్ని, శ్రమని వృధా చేసుకునే వారుమిషన్ భగీరధ( Mission Bhagiratha ) కంటే ముందు భూగర్భ జలాలతో ( బోర్లు మోటార్లతో ) నీటి సరఫరా జరిగేది.

ఇవి నిలకడగా ఉండక నిరంతరం నీటి కొరతకు దారి తీస్తూ ఉండేది.అంతేకాక, భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ కారణంగా ప్రజలు ఫ్లోరోసిస్ బారిన పడేవారు.ప్రతి వేసవికి భూగర్భ జలాల మట్టము పడిపోవడం వల్ల త్రాగు నీటి కొరత తారా స్తాయికి చేరి సీఆర్ఎఫ్ / నోన్ సీఆర్ఎఫ్ నిధుల ద్వారా వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకొని ట్యాంకర్ల ద్వారా మంచి నీటి సరఫరా చేయవలసి వచ్చేది.క్రొత్తగా బోర్లు వేసినా, నీటి లభ్యత లేనందువల్ల బోర్లు విఫలమయ్యేవి.

అందువలన, ప్రజలకు మంచి నీటి ఇబ్బందులు తప్పెవి కాధు.

ఈ పరిస్తితుల ధృష్ట్యా, తెలంగాణ రాష్ట్రం( Telangana State )లోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో 43,791 కోట్ల బడ్జెట్ తో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరధను ప్రారంభించింది.

తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేకర్ రావు సిద్ధిపేట శాసనసబ్యుడిగా ఉన్నప్పుడు 1998 సంవత్సరంలో “ సిద్దిపేట సమగ్ర త్రాగునీటి పధకం “ (ప్రతి గృహానికి నీరు అందించాలని) రూపొందించారు.దీన్ని ఆదారంగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన తరువాత మిషన్ భగీరత పధకాన్ని గౌరవ ముక్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టారు.

ఇట్టి మిషన్ భగీరధ పధకంలో భాగంగా గ్రామాల్లోని ప్రతీ ఒక్కరికి రోజుకు 100 లీటర్లు, మున్సిపాలిటీల్లోని ప్రతీ ఒక్కరికి రోజుకు 135 లీటర్లు, మున్సిపల్ కార్పోరేషన్ల పరిధిలోని ప్రతీ ఒక్కరికి రోజుకు 150 లీటర్ల తాగునీరు అందించాలని నిర్ణయించడం జరిగింది.ఇట్టి నీటి సరఫరాకై, కృష్ణా, గోదావరి నదులు, వాటికి అనుసంధానించిన ప్రధాన రిజర్వాయర్లు తదితర ఉపరితల జల వనరుల నుండి నీటిని కేటాయించడం జరిగింది.

అనుకున్నదే తడవుగా 2015వ సంవత్సరంలో ఈ పధకాన్ని మొదలుపెట్టి అకుంఠిత దీక్ష, క్రమశిక్షణ మరియూ నిబద్దతతో అనతి కాలంలోనే పూర్తి చేయడం జరిగింది.ఈ పధకంలో భాగంగా ప్రధాన రిజర్వాయర్లలో (19) ఇన్టేక్ వెల్స్, (50) మంచినీటిని శుద్దిచేసే కేంద్రాలు, (2983) నీటిని తోడే ప్రధాన పంపులు, 56 వేల కిలో మీటర్ల ప్రధాన పైపులైన్లు మరియూ ఇతర ప్రధాన ట్యాంకులు నిర్మించి రాష్ట్రంలో ప్రతీ గ్రామానికి మరియూ పల్లెపల్లెకు స్వచ్చమైన త్రాగునీరు సరఫరా చేయబడుతుంది.

తెలంగాణ రాష్ట్రావతరణానికి పూర్వం, సిరిసిల్ల వేములవాడ మరియు చొప్పదండి నియోజకవర్గ వాసులు నిత్యం మంచి నీటి అవసరాల కొరకు తీవ్ర ఇబ్బందులు పడేవారు.మిషన్ భగీరథ ఏర్పాటుతో, నియోజక వర్గ మంచి నీటి సరఫరా ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఉపరితల నీటి వనరులైనటువంటి, మిడ్ మానైర్ రిజర్వాయర్ నుండి సేకరించిన నీటి ద్వారా సిరిసిల్ల వేములవాడ, చొప్పదండి నియోజకవర్గం లోని అన్ని గ్రామాలకు, మునిసిపాలిటీలకు స్వచ్చమైన త్రాగునీటిని సరఫరా చేస్తుంది.మిషన్ భగీరధ పదకం మన సిరిసిల్ల వేములవాడ చొప్పదండి సెగ్మెంటు కి గోదావరి నదితో అనుసంధానమైన మిడ్ మానైర్ రిజర్వాయర్ ద్వారా వేములవాడ మండలంలోని రుద్రవరం గ్రామ పరిధిలో ఇన్టేక్ వెల్ ద్వారా పంపులతో తోడి, అగ్రహారం లో ఉన్నటువంటి 120 ఎం ఎల్ డి నీటి శుద్ది కేంద్రం లో శుద్ది చేసి, 1567 కి.మీ పైపుల ద్వారా, 2 మాస్టర్ బాలెన్సింగ్ రెసెర్వాయిర్ల ద్వారా, 2 ఓవర్ హెడ్ బాలెన్సింగ్ రెసెర్వాయిర్ల ద్వారా, 10 బ్రేక్ ప్రెషర్ ట్యాంకుల ద్వారా, 24 సంప్ ల ద్వారా, 427 గ్రామలలోని 879 ట్యాంకులకి, 3 యు ఎల్ బి లకు ప్రతి రోజూ సరఫరా చేయబడుతుంది.అంతే కాకుండా సిరిసిల్ల వేములవాడ చొప్పదండి సెగ్మెంటు లో భాగంగా గోదావరి నదితో అనుసంధానమైన అప్పర్ మానైర్ రిజర్వాయర్ ద్వారా నీటిని పంపులతో తోడి, కొల్లమద్దిలో ఉన్నటువంటి 7 ఎం.ఎల్.డి నీటి శుద్ది కేంద్రం ద్వారా శుద్ది చేసి, 60 కి.మీ పైపుల ద్వారా, 1 ఓవర్ హెడ్ బాలెన్సింగ్ రెసెర్వాయిర్ల ద్వారా, 3 సంప్ లు ద్వారా సిరిసిల్ల జిల్లాలోని, గంభీరావుపేట మండలంలోని 9 గ్రామాలు, ముస్తాబాద్ మండలంలోని 8 గ్రామాలు మొత్తం 17 గ్రామలలోని 38 ట్యాంకులకి ప్రతి రోజూ నీటి సరఫరా చేయబడుతుంది.గ్రిడ్ పరంగా సిరిసిల్ల నియోజికవర్గమునకు 425 కోట్లు, వేములవాడ నియోజికవర్గమునకు 375 కోట్లు మరియు చొప్పదండి నియోజికవర్గమునకు 332 కోట్లు వెచ్చించడం జరిగినది.

మొత్తం వ్యయం 1132 కోట్లతో గ్రిడ్ పనులు పూర్తి చేసి, 2018 నుంచి నీటి సరఫరా చేయడం జరుగుతుంది.

ఇంట్రా పరంగా నియోజకవర్గాల వారిగ చూసుకుంటే, సిరిసిల్ల నియోజికవర్గమున( Sirisilla Constituency )కు 73 కోట్లతో 141 గ్రామలలోని 286 ట్యాంకులకి, 609 కీ.మీ అంతర్గత పైపులైన్లు ద్వారా, 54,178 నల్లా కనెక్షన్లకు, వేములవాడ నియోజికవర్గమునకు 41 కోట్లతో 104 గ్రామలలోని 169 ట్యాంకులకి, 396 కీ.మీ అంతర్గత పైపులైన్లు ద్వారా, 40993 నల్లా కనెక్షన్లకు , చొప్పదండి నియోజికవర్గమునకు 13 కోట్లతో నియోజకవర్గంలోని 30 గ్రామలలోని 54 ట్యాంకులకి, 133 కీ.మీ అంతర్గత పైపులైన్లు ద్వారా, 9853 నల్లా కనెక్షన్లకు, మానకొండూర్ నియోజికవర్గమునకు 14 కోట్లతో 49 గ్రామలలోని 85 ట్యాంకులకి, 104 కీ.మీ అంతర్గత పైపులైన్లు ద్వారా, 14704 నల్లా కనెక్షన్లకు, బాల్కొండ నియోజికవర్గమునకు 3 కోట్లతో 10 గ్రామలలోని 14 ట్యాంకులకి, 17 కీ.మీ అంతర్గత పైపులైన్లు ద్వారా, 1427 నల్లా కనెక్షన్లకు ప్రతి రోజూ నీరు సరఫరా చేయబడుతుంది.ఇంటింటికి నీటి సరఫరాతోపాటు పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు, ప్రార్దనా స్థలాలు మరియు ప్రభుత్వ కార్యాలయాలకు మిషన్ భగీరథ పధకము ద్వారా నీటి సరఫరా చేయడం జరుగుతుంది.

మరియు సిరిసిల్ల నియోజకవర్గం లోని అప్పారెల్ పార్కుకు, వేములవాడ నియోజకవర్గం లోని వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానమునకు మరియు చొప్పదండి నియోజకవర్గం లోని శ్రీ కొండగట్టు అంజనేయ స్వామి దేవస్థానమునకు నీటి సరఫరా జరుగుతున్నది.

సిరిసిల్ల వేములవాడ(Vemulawada ) మరియు చొప్పదండి మున్సిపాలిటీకు మిషన్ భగీరథ ద్వారా బల్క్ నీటి సరఫరా జరుగుతున్నది.

స్వాతంత్ర్యం వచ్చిన కానుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రంలో కేవలం 17 వేల నీటి ట్యాంకులు, 10 వేల కి.మీ అంతర్గత పైపులైన్లు నిర్మిస్తే, ఈ రోజు మిషన్ భగీరధ పధకం ద్వారా అదనంగా 18, 560 నీటి ట్యాంకులు, 67,000 కిలో మీటర్ల అంతర్గత పైపులైన్లు మరియూ 57 లక్షల నల్లా కనెక్షన్లు నిర్మించడం కేవలం ఒక అకుంఠిత దీక్ష ద్వారా మాత్రమే మన ప్రభుత్వం వల్లనే సాధ్యమయ్యింది.ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఒక్కటే యావత్ బారతదేశంలో, ఉపరితల నీటిని శుద్ది చేసి ఇంటింటికి స్వచ్చమైన త్రాగునీరును నయా పైసా లబ్ది దారుల నుండి తీసుకోకుండా ఉచితంగా అందిస్తుంది.అంతే కాకుండా దేశంలో ప్రతి మనిషికి 100లీ చొప్పున గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా చేసే ఏకైక రాష్ట్రం మన తెలంగాణ.

ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో, మహిళలు వీధిలో ఉన్న నల్లా లేదా బోరింగ్ ల దగ్గర తాగునీళ్లు పట్టుకునేవారు.ఇందుకోసం చాలా సమయం పట్టేది.శుభ్రమైన తాగునీటి కోసం చాలా దూరం పోయేవారు.ఇక ఎండాకాలంలో నీటి వనరులు ఎండిపోతే సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ బావులు, ఇతర నీటి వనరుల దగ్గరికి వెళ్లి తాగునీటిని తెచ్చుకునే పరిస్తితి.

ఇంటి అవసరాల కోసం ఇతర పనులు చేయడానికి స్త్రీలకు అవకాశం ఉండేది కాదు.

అంతేకాకుండా ఆ రోజుల్లో నీటి సరఫరా కేవలం భూగర్భ జల వనరులైన బావుల ద్వారానే జరిగేది.

ఇట్టి భూగర్భ జల వనరులలో నీరు మందంగా ఉండడమే కాకుండా వివిధ హానికర లవణాలు మరియూ సూక్ష్మ క్రిములు ఉండేవి.మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఫ్లోరైడ్ బాధిత గ్రామాలుఉండేవి.

అధిక మోతాదులో ఫ్లోరైడ్ ఉండే నీటిని దీర్ఘ కాలం త్రాగడం వలన ఫ్లోరోసిస్ వ్యాది సోకేది.ఈ వ్యాధి మూలంగా ఎముకలు వంకర్లు తిరగడం, దంతాలు పాడవటమే కాకుండా త్వరగా ముసలితనం వచ్చేది.

త్రాగునీరు సూక్ష్మ క్రిములచే కలుషితం అయినప్పుడు కలరా మరియూ టైఫాయిడ్ జ్వరాలు కూడా వచ్చేవి.అధిక మోతాదులో లవణాలుండే బావి నీటిని దీర్ఘ కాలం త్రాగడం వలన కొన్ని సార్లు మూత్రపిండాలు దెబ్బతినేవి.

సమైక్య రాష్ట్రంలో కేవలం అతికొద్ది గ్రామాలకు మాత్రమే ప్రతి మనిషికి 40 లీ శుద్ది చేసిన ఉపరితల నీటిని సరఫరా చేసేవారు.ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రాంత, జిల్లా, మండల, గ్రామ, పేద, ధనిక తరతమ్యాలు లేకుండా ప్రతి ఇంటికి కూడా స్వచ్చమైన వర్షాధార జలవనరులనుండి సేకరించిన నీటిని శుద్దిచేసి నీటి నాణ్యతా పరీక్ష చేసి మరియూ తగిన మోతాదులో క్లోరిన్ కలిపి సరఫరా చేయడం జరుగుతుంది.

మానవ శరీరానికి సుమారుగా 300 నుండి 450 మిల్లీ గ్రాముల ఖనిజ లవణాలు అవసరం, అట్టి ఖనిజ లవణాలు ఉండే నీటిని ఈ మంచి నీటి పధకం ద్వారా సరఫరా చేయడం జరుగుతుంది.హైదరాబాద్ లాంటి నగరాలకు ఏదైతే మంచినీరు సరఫరా అవుతోందో అలాంటి నాణ్యమైన త్రాగు నీరు ఈ రోజు మిషన్ భగీరథ పదకం ద్వారా ప్రతి పల్లెకు గ్రామగ్రామంకీ సరఫరా అవుతున్నది.

ఆర్‌ఓ వాటర్ లో కేవలం 10 నుండి 50 మిల్లీ గ్రాముల ఖనిజ లవణాలు మాత్రమే ఉంటాయి.దీర్గ కాలం ఆర్‌ఓ వాటర్ త్రాగడం వలన కీళ్ల నొప్పులు మరియూ మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువ.

అందరూ ఇది గమనించి ఆర్‌ఓ వాటర్ బదులు మిషన్ భాగీరథ నీటినే త్రాగాలని మనవి.తెలంగాణ మంచి నీటి సరఫరా వ్యవస్తను పరీక్షించిన కేంద్ర ప్రభుత్వము ప్రశంసిస్తూ 2022 లో నిత్యం నీటి సరఫరా చేసే మొదటి రాష్ట్రంగా అవార్డ్ ఇచ్చింది.

ఎంతో మంది రాష్ట్ర మరియూ దేశ ప్రతినిదులు తెలంగాణ మంచి నీటి సరఫరాను పరిశీలించి ఇది దేశం మొత్తం అనుసరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.ఈ రోజు మన రాష్ట్రంలో నీటి సంబంధిత వ్యాధులు లేవు, ఏ మహిళ బైటకెళ్లి నీళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్తితిలేదు ఫలితంగా చాలామేర జీవన ప్రమాణాలు పెరిగాయి.

ఇట్టి మంచి నీటి సౌకర్యం కల్పించిన మన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేస్తూ, ఇట్టి నీటిని సద్వినియోగం చేసుకుని మంచి నీటి వ్యవస్తను కాపాడతారని ఆశిస్తున్నాము.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube