శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సినీ నటుడు సుమన్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు సుమన్ సోమవారం నాడు దర్శించుకున్నారు.శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ప్రత్యేక పూజలలో పాల్గొన్న అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం గావించారు.

 Film Actor Suman Visited Sri Rajarajeswara Swamy Temple, Film Actor Suman ,sri R-TeluguStop.com

ఆలయ ఏఈఓ బ్రాహ్మణ శ్రీనివాస్ శ్రీ స్వామివారి ప్రసాదం అందజేశారు.ఆలయ ప్రోటోకాల్ సూపర్ ఇంటెండెంట్ సిరిగిరి శ్రీరాములు ఉన్నారు.

మహిమగల పుణ్యక్షేత్రం వేములవాడ – సినీ నటుడు సుమన్.వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం అత్యంత మహిమగల పుణ్యక్షేత్రమని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు.

సోమవారం నాడు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు అత్యంత మహిమ కలిగిన దేవుడని అందుకే ప్రతినిత్యం వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనం కోసం వస్తున్నారని అన్నారు.ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కోరుకున్నానని సుమన్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube