ప్రజావాణికి 121 దరఖాస్తుల రాక - అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 121 దరఖాస్తులు వచ్చాయనీ,ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.రెవెన్యూ శాఖకు 50, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి 12, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయానికి ఆరు, వ్యవసాయ శాఖ, ఉపాధి కల్పనా శాఖలకు 5 చొప్పున, జిల్లా పంచాయతీ కార్యాలయం, ఎంపీడీవో తంగళ్ళపల్లి, ముస్తాబాద్, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయానికి నాలుగు చొప్పున, జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయానికి మూడు, వైద్య కళాశాల,

 121 Applications Received By Prajavani Collector Sandeep Kumar Jha Received Appl-TeluguStop.com

డిఆర్డిఓ, మిషన్ భగీరథ, ఎంపీడీవో కోనరావుపేట, సెస్ కార్యాలయానికి రెండు చొప్పున, ఏడి మైన్స్, జిల్లా వైద్యాధికారి, డిపిఆర్ఈ, ఈవో రాజరాజేశ్వరాలయం వేములవాడ, నీటిపారుదల , జిల్లా ఎస్పీ కార్యాలయం, వేములవాడ మున్సిపల్ కార్యాలయం, ఎంపీడీవో గంభీరావుపేట, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట రిజిస్టర్ కార్యాలయానికి ఒకటి చొప్పున వచ్చాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శేషాద్రి,వేములవాడ ఆర్డిఓ రాజేశ్వర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube