రాజన్న సిరిసిల్ల జిల్లా : యువత మేలుకో అంటూ సిరిసిల్ల వైద్య కళాశాల ఎంబిబిఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కార్యక్రమాన్ని సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారం ఉదయం నిర్వహించారు.ఈ సందర్భంగా యువత చెడు వ్యసనాలకు వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్తూ ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అందరికీ స్ఫూర్తినిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బైరి లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ లక్ష్మీనారాయణ, డిప్యూటీ సూపరిండెంట్ డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ నాగార్జున చక్రవర్తి, ఎంబిబిఎస్ ఫస్ట్ ఇయర్ సెకండియర్ స్టూడెంట్స్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ , ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, డీపీఆర్ఓ, మీడియా మిత్రులకు నిర్వహకులు కృతజ్ఞతలు తెలిపారు.