పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు

ఎన్నికల పోలీస్ పరిశీలకులు వినిత సాహు.రాజన్న సిరిసిల్ల జిల్లా :ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేల ఎన్నికల సమయంలో ప్రజల్లో నమ్మకాన్ని దైర్యాన్ని కలిగించడంలో పోలీస్ పాత్ర కీలకం,ఫ్రీ అండ్ ఫేర్ గా ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పని చేయాలని జిల్లా ఎన్నికల పోలీస్ పరిశీలకులు వినిత సాహు అన్నారు.సాధారణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గురువారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండా సామి,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లతో కలసి పోలింగ్ ముందు, పోలింగ్ రోజు, పోలింగ్ తరువాతి రోజు తీసుకోవాలని భద్రత చర్యలు,ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ , ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్ల మీద సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్నికల పోలీస్ పరిశీలకులు వినిత సాహు మాట్లాడుతూ ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేల ,ఎన్నికల సమయంలో ప్రజల్లో నమ్మకాన్ని దైర్యాన్ని కలిగించడంలో పోలీస్ పాత్ర కీలకం,ఫ్రీ అండ్ ఫేర్ గా ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పని చేయాలన్నారు.

 Elections In A Calm Environment With A Solid Plan , District Sp Akhil Mahajan, E-TeluguStop.com

ఎన్నికల సందర్భంగా జిల్లాలో పోలీసులు శాంతిభద్రతలు కాపాడడం సంఘ వ్యతిరేక శక్తులకార్యకర్తలను, ఊరేగింపులు, బహిరంగ సమావేశాలు నిర్వహణ క్రమబద్ధం చేయడం ఎన్నికల ప్రక్రియ పట్ల సామాన్య ప్రజల్లో నమ్మకం కలిగించడంలో ముఖ్యమైన పాత్రని పోలీసులు వహించాల్సి ఉంటుందని ఎన్నికల ప్రచారం శాంతియుతంగా న్యాయబద్ధంగా జరిగేటట్లు హింసాత్మక సంఘటనలు జరగకుండా చూడాల్సిన అనితర బాద్యత పోలీసు శాఖ పై ఉంటుందని జిల్లాలో ఫ్రీ అండ్ ఫేర్ గా ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పని చేయాలని అన్నారు.పోలీస్ సిబ్బంది, అధికారులు విసిబుల్ గా ఉంటు ఎన్నికలకు సంబంధించి గ్రామాలలో జరిగే ప్రతి విషయం పోలీసులకు తెలిసి ఉండాలని అన్నారు.

జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని,నగదు, మద్యంపై ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంచుతూ పోలీస్ స్టేషన్ ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు.అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ( District SP Akhil Mahajan )ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖ తీసుకున్నా చర్యలను, చేపట్టబోయే చర్యలను అనగా జిల్లాలో ఎన్నికల విధులపై పోలీసు అధికారులకు సిబ్బందికి 07 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని,జిల్లా సరిహద్దు వెంట 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండేలా ప్రణాళికతో 06 చెక్ పోస్ట్ లు,డైనమిక్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి జిల్లాలో విస్తృత తనిఖీలు నిర్వహించి 75,43,595/- రువుయాల నగదు సీజ్ చేయడం జరిగిందని,31కిలోల 780 గ్రాముల గంజాయి,1137 లీటర్ల లిక్కర్,15,20,370/- రూపాయల విలువ గల చీరలు, బ్లౌస్ ,టవల్స్, టి షార్ట్స్ సీజ్ చేయడం జరిగిందిని,గత ఎన్నికలలో నేరాలకు పాల్పడిన వారి, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వారిని ముందస్తుగా 582 కేసులల్లో 1503 మందిని గుర్తించి బైండోవర్ చేయడం జరిగిందన్నారు.

గ్రామాల్లో చేపట్టిన ఫ్లాగ్ మార్చ్ లు,రూట్ మార్చ్ లు, ఆయా పోలీస్ స్టేషన్ ల పరిదిలో వాహనాల తనిఖీల సమయంలో , కేంద్ర బలగాల సద్వినియోగం,77 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్న గ్రామాల్లో ప్రణాళిక ప్రకారం రక్షణ చర్యలు తీసుకుంటున్న తీరు, కేంద్ర బలగాలు, జిల్లా పోలీస్ బలగాలు సుమారు 1000 మంది పోలీస్ సిబ్బంది తో తో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రత, ఓట్ల కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయబోయే మూడు అంచల భద్రత గురించీ తెలియజేశారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య( SP Chandraiah ),ఎక్సైజ్ సూపర్డెంట్ పంచాక్షరి,డిఎస్పీ లు ఉదయ్ రెడ్డి ,నాగేంద్రచరి, రవికుమార్, సి.ఐ లు ఉపేందర్, సదన్ కుమార్,శశిధర్ రెడ్డి, కరుణాకర్, కృష్ణకుమార్,కిరణ్ కుమార్, అనిల్ కుమార్, ఆర్.ఐ యాదగిరి ఉన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube