సైబర్ నిందితుడు అరెస్టు... 247970/- రూపాయలు, రెడ్ మీ మొబైల్ ఫోన్ స్వాధీనం

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట్ పోలీస్ స్టేషన్లో సైబర్ నిందితుడి అరెస్ట్ వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించిన చందుర్తి సి.ఐ కిరణ్ కుమార్.

 Cyber ​​suspect Arrested 247970 Rupees, Red Me Mobile Phone Seized, Cyber �-TeluguStop.com

ఈ సందర్భంగా సి.ఐ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.తేదీ 02.06.2023 రోజున కొనరావుపేట మండలం శివంగలపల్లి గ్రామానికి చెందిన కొమ్ము పోచయ్య అనే వ్యక్తి తన కొడుకు కొమ్ము ప్రశాంత్ బతుకుతెరువు కోసం మస్కట్ దేశం వెళ్లాడని అతను అక్కడి నుండి డబ్బులు పంపిస్తే ఏటీఎం ద్వారా వీళ్ళు డ్రా చేసుకొని వాడుకునే వాళ్ళని, అయితే పోచయ్య ఇంటి ప్రహరీ గోడ పెట్టుటకు డబ్బులు కావాలని అడుగగా ప్రశాంత్ తన యూనియన్ బ్యాంకు అకౌంట్ నెంబర్ 064710100132494 నందు రెండున్నర లక్షలు ఉన్నాయని వాడుకోమని చెప్పాడు.పోచయ్య వెళ్లి ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేద్దాం అని ఏటీఎం కి వెళ్లి చూడగా డబ్బులు లేవని ఏటీఎం నందు చూపెట్టింది.దాంతో బ్యాంకు నందు సంప్రదించగా తేదీ 10.04.2023 నుండి 13.04.2023 వరకు పలు దఫాలుగా మొత్తం 2,47,973/- రూపా యలు ఆన్లైన్ పేమెంట్ ద్వారా డ్రా అయినట్టు బ్యాంక్ వారు తెలిపారు.

దాంతో పోచయ్య పోలీస్ స్టేషన్ లో తన కొడుకు ఎకౌంట్ ని ఆన్లైన్ ద్వారా ఎవరో గుర్తు తెలియని వారు డబ్బు డ్రా చేసి మోసం చేశారని కోనరావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

దీనిపై ఎస్సై రమాకాంత్ కేసు నమోదు చేసిన అనంతరం చందుర్తి సిఐ కిరణ్ కుమార్ దర్యాప్తు లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం జిల్లా ఉద్దవోలు గ్రామానికి చెందిన కర్రి నవీన్ కుమార్ వృత్తిరీత్యా హెచ్ బి సి కంపెనీ బెంగళూరు లో సాప్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడు.గత ఫిబ్రవరిలో తన ఇంటి నందు జియో ఫైబర్ నెట్ పెట్టించుకున్నాడు.అప్పుడు అతను జియో సిమ్ 9346191678 నీ తీసుకున్నాడు,తర్వాత తేదీ 03.04.2023 న ఒక లక్ష రూపాయలు అకౌంట్ లో క్రెడిట్ అయినట్టు నవీన్ తన జియో సిమ్ కి మెసేజ్ వచ్చింది కానీ అతనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ కాలేదు.తేదీ 07.04 .2023 నాడు ఇంట్రెస్ట్ 1000 రూపాయలు క్రెడిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది.

ఈ డబ్బులు కూడా తన బ్యాంక్ అకౌంట్లో జమ కాకపోయేసరికి తాను ఈ యొక్క జియో నెంబర్ ద్వారా పేటీఎం ఎకౌంట్ ని క్రియేట్ చేసుకుని చూడగా తన యొక్క జియో నెంబర్ కొమ్ము ప్రశాంత్ అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయినట్టు తెలుసుకొని ప్రశాంత్ అకౌంట్లో రెండు లక్షల నలభైవేల చిల్లర డబ్బులు ఉన్నాయని తెలుసుకొని ప్రశాంత్ ని మోసం చేసి ఆ డబ్బులు డ్రా చేసుకుందామని , తేదీ 10.4.2023 నుండి తేదీ 13.04.2023 వరకు నవీన్ కుమార్ తన జియో నెంబర్ ద్వారా క్రియేట్ చేసుకున్న పేటీఎం నుండి పలు దఫాలుగా 2,47,973/- రూపాయలు విత్ డ్రా చేసుకున్నాడని కేసు దర్యాప్తులో తేలింది.అయితే కొమ్ము ప్రశాంత్ తాను మస్కట్ కి వెళ్లే ముందు తాను జియో నెంబర్ 9346191678 నీ వాడాడు అదే నెంబర్ ని తన యూనియన్ బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేసుకున్నాడు తర్వాత అతను మస్కట్ వెళ్లాక ఆ నెంబర్ ని వాడలేదు.

తన బ్యాంక్ అకౌంట్ కి ఆ నంబర్ నీ డిఆక్టివేట్ చేయలేదు.కొన్ని నెలల తరువాత అదే నెంబర్ ను సర్వీస్ ప్రొవైడర్ వారు నిందితుడైన కర్రీ నవీన్ కుమార్ కి కేటాయించారు.

నవీన్ కుమార్ దానిని అదునుగా తీసుకొని కొమ్ము ప్రశాంత్ ని మోసం చేసి తన అకౌంటు ద్వారా డబ్బులు తీసుకున్నాడు.

సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ యొక్క కేసుని చేదించి కర్రీ నవీన్ కుమార్ ఆ డబ్బు తీసుకొని తన ఫ్రెండ్స్ తో జల్సాలకు హైదరాబాద్ వెళ్తుండగా వరంగల్ లో ఈరోజు అతనిని పట్టుకొని మొత్తం డబ్బు రెండు లక్షల 47 వేల 970 రూపాయలు అతని నుండి మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రజలకు పోలీస్ వారు తగు సూచనలు చేశారు.ఎవరైనా తమ మొబైల్ నెంబర్ ని వాడటం నిలిపివేస్తే తప్పకుండా దానికి లింక్ అయినా బ్యాంక్ అకౌంట్ కి, డిజిటల్ పేమెంట్స్ అకౌంట్ కి డి ఆక్టివేట్ చేయాల్సిందిగా తెలియజేశారు.

ఈ కేసును చేదించి నిందితున్ని పట్టుకొని డబ్బులు రికవరీ చేసిన చందుర్తి సీఐ కిరణ్ కుమార్, కోనరావుపేట ఎస్సై రమాకాంత్, సిబ్బంది ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి,కానిస్టేబుల్ దండి నరేష్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube