రాజన్న సిరిసిల్ల జిల్లా: క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నెహ్రు యువ కేంద్ర సంఘటన్, ఆదేశాల మేరకు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో తేదీ:14-07-2023 రోజు జిల్లాస్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమం సిరిసిల్ల లో నిర్వహించబడుతుందనీ నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి ఎం.వెంకట్ రాంబాబు తెలిపారు.
ఈ మేరకు ఆయన మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ జిల్లా స్థాయి యువ ఉత్సవంలో 15 సంవత్సరముల నుండి 29 సంవత్సరముల లోపు యువతీ యువకులు పాల్గొనవచ్చుననీ అన్నారు.
ఈ కార్యక్రమంలో కవిత్వము, పెయింటింగ్, మొబైల్ ఫోటోగ్రఫీ, ఉపన్యాస పోటీలు, గ్రూపు సాంస్కృతిక పోటీలు నిర్వహించబడతాయి.కవిత్వము, పెయింటింగ్, మొబైల్ ఫోటోగ్రఫీ పోటీలకు ప్రథమ బహుమతి 1000,ద్వితీయ బహుమతి 750,తృతీయ బహుమతి 500,ఉపన్యాస పోటీకి ప్రథమ బహుమతి 5000,ద్వితీయ బహుమతి 2000,తృతీయ బహుమతి 1000.
గ్రూపు సాంస్కృతిక పోటీలకు ప్రథమ బహుమతి 5000,ద్వితీయ బహుమతి 2500,తృతీయ బహుమతి 1,250 లు ఇవ్వబడతాయి.
ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి యువ ఉత్సవ్, జిల్లా రైతు వేదిక చంద్రంపేట, జంక్షన్ లో తేదీ 14-07- -2023 రోజు నిర్వహించడం జరుగుతుంది.
ఆసక్తి కలిగిన యువతీ యువకులు డైరెక్టుగా ఉదయము 9 గంటలకు జిల్లా రైతు వేదిక, చంద్రంపేట జంక్షన్, రాజన్న సిరిసిల్ల లో పాల్గొనగలరని తెలియజేశారు.ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా అదనపు కలెక్టర్ లు ఈ నెల 14 వ తేదీన సిరిసిల్ల పట్టణంలోనీ జిల్లా రైతు వేదికలో జరగనున్న జిల్లాస్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమం వాల్ పోస్టర్ లను జిల్లా అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్ లు కలెక్టరేట్ లో మంగళవారం ఆవిష్కరించారు.
యువ ఉత్సవ్ కార్యక్రమంను జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి ఎం.వెంకట్ రాంబాబు, డిపిఆర్ఓ మామిండ్ల దశరథం లు పాల్గొన్నారు.