ఆంధ్రుల కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని కేసీఆర్ అన్నది యాదికి లేదా..

తెలంగాణ అధికారిక చిహ్నంపై, జయ జయహే తెలంగాణ గీతంపై బిఆర్ఎస్ చేస్తున్న వాటిపై ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం వేములవాడ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు.వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన అందెశ్రీ రాసిన పాట జయ జయహే తెలంగాణ తెలంగాణ ఉద్యమ పేరుట అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పరిపాలించి విరు జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతం చేయాలని సోయి లేని వారు.

 Vemulawada Mla Adi Srinivas Shocking Comments On Kcr, Vemulawada, Mla Adi Sriniv-TeluguStop.com

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జయ జయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించి జూన్ 2న ప్రకటించడానికి నిర్ణయం తీసుకొని రచయిత కవి అందెశ్రీ కి స్వర కల్పన రూపకల్పన చేయమని ఇస్తే ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణికి ఇస్తే తెలంగాణ గీతం, చిహ్నంపై అస‌వ‌స‌ర రాద్దాంతానికి అవ‌కాశం ఇస్తున్నారు.తెలంగాణ గీతం గురించి ఎందుకు అబ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నారు.

తెలంగాణ ఆర్తి, గుండెత‌డి తెలిసిన అణ‌గారిన వ‌ర్గానికి చెందిన అందెశ్రీ గీతానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ట్టాభిషేకం చేస్తుంటే స‌హించ లేకనే కొత్త ర‌గ‌డ చేస్తున్నారు.

జ‌య‌జ‌య‌హే గీతానికి ప్ర‌శ‌స్త్యం ద‌క్కకుండా యాగి చేస్తున్నారు.

ఆంధ్ర మూలాలు వున్న వ్యక్తి మ్యూజిక్ కంపోజ్ చేస్తే తెలంగాణ పాట మైల ప‌డుత‌దా? స్వ‌రాష్ట్రంగా ఏర్పాటై ప‌దేల్లు అయినాకా కూడా ఇంకా ప్రాంతీయ పంచాయితి దేనికి?ఎవరితో స్వ‌ర క‌ల్ప‌న చేయించాలో ర‌చ‌యిత అందేశ్రీ ఇష్టం.ర‌చ‌యిత‌కు స్వేచ్చ ఉండోద్దా.

ఈయ‌న‌తోనే మ్యుజిక్ కొట్టించాలి.ఆయ‌న‌తోనే చేయించాలి అని చెప్ప‌డానికి మీరేవ‌రు.ఇది దొర‌గ‌డిల పాట కాదు.మిరు చెప్పిన‌ట్లు గానం చేయ‌డానికి.దొర‌ల‌ను దిగంతాల‌కు త‌రిమిన మ‌ట్టి మాట‌.మీ మ‌రుగుజ్జు వాద‌న ను మానుకోండి.

తెలంగాణ వాదం అంటే సంకుచిత భావాల సమాహారం కాదు.విశాల దృక్పథం.

అందుకే అందేశ్రీకి కాంగ్రెస్ ప్ర‌భుత్వం పూర్తి స్వేచ్చ ఇచ్చింది.పొట్ట‌కూటీ కోసం వ‌చ్చిన వాల్ల‌తో తెలంగాణ‌కు పంచాయితి లేదు.

పొట్ట కొట్టే వాల్ల‌తోనే పంచాయితి అని ఉద్య‌మంలో మ‌నం చెప్పుకున్నాం క‌దా.ఆ సోయి ఎక్క‌డ పోయింది.

అస్కార్ అవార్డు గ్ర‌హిత ఎం ఎం కిరవాణి…ఆంధ్ర త‌ల్లిదండ్రుల‌కు పుట్టి ఉండ‌వ‌చ్చు.ఏనాడైనా తెలంగాణ ఉద్య‌మాన్ని వ్య‌తిరేకించాడా.

స‌మైక్య రాగం ఆల పించ‌డా? క‌ల‌ల‌కు ఎల్ల‌లు లేవు.హ‌ద్దులు స‌రిహ‌ద్దులు అస‌లే లేవు.

ప్ర‌త్యేక తెలంగాణ త‌న‌కు తానుగా సొంత అధికారిక గీతాన్ని ఆమోదించుకుంటున్న సంద‌ర్భం.మంచి పండ‌గ రోజు.

ఈ పండ‌గ రోజున మ‌న రాజ‌కీయ వివాదాల‌ను ప‌క్క‌న పెడుతాం.యావ‌త్ తెలంగాణ ఒక్క‌టే అనే నీతిని జ‌గానికి చాటుదాం.

అయినా బీఆర్ఎస్ కు తెలంగాణ సోయి ఎక్క‌డిది?

యాదాద్రి ఆర్కిటెక్ట్ గా ఆంధ్ర సాయిని నియమించినప్పుడు ఎక్కడ పోయింది మీ పౌరుషం?

ఆంధ్రుల కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని కేసీఆర్ అన్నది యాదికి లేదా?

ఆంధ్ర కోడలు సమంతను తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా, ఆంధ్ర అమ్మాయి మంచు లక్ష్మిని తెలంగాణ స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్ గా, రాష్ట్రానికి సంబంధం లేని రకుల్ ప్రీత్ ని బాలిక విద్యకు బ్రాండ్ అంబాసిడర్ గా కేటీఆర్ నియమించినప్పుడు.తెలంగాణ సోయి లేదా?

ఉద్యమంలో వేనోళ్ళ పాడిన జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం అన్న గేయాన్ని కటిక దరిద్రంలో పుట్టి తన స్వరాన్ని… స్వరాష్ట్రం కోసం మండించిన తెలంగాణ బిడ్డ అందెశ్రీ.

అందెశ్రీ కి ఎక్కడ గౌరవం దక్కుతుందో అన్న దుర్బుద్ధి తో రాష్ట్ర గేయం గా పెట్టకుండ తొక్కిపట్టిండు కెసిఆర్.అలాంటి గేయానికి కాంగ్రెస్ సర్కార్ పబ్బతి పడితే.

కెసిఆర్ అండ్ కో కి ఎందుకు నొప్పి?

కాంగ్రెస్ ప్రభుత్వం అందెశ్రీ గేయాన్ని రాష్ట్ర గేయంగా ప్రకటిస్తుంది.దాన్ని తట్టుకోలేక పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే ఉద్యమంలో కిరవాని ఆంధ్ర అని కొర్రీలు పెడుతున్నారు.

తెలంగాణ అధికారిక చిహ్నంపై వివాదం ఎందుకు.

రాచ‌రిక‌పు ఆన‌వాల్లు లేకుండా.

తెలంగాణ తిరుగుబాటు త‌త్వం, శ్రమైక జీవన విధానం, ఒక్క‌డి మ‌ట్టి మ‌నుషుల పోరాటాలు, అస్థిత్వ ప్ర‌తీక‌ల‌కు ప్ర‌తిబింబంగా.తెలంగాణ చిహ్నాన్ని ప్ర‌జ‌లు, ఉద్య‌మ‌కారులు, మేదావులు, ప్ర‌జా సంఘాల ఆకాంక్ష‌ల మేర‌కు రూపుదిద్దుకుంటుంది.

కాక‌తీయ క‌ళాతోర‌ణం, చార్మినార్ లు తెలంగాణ కు తీపి గుర్తులే.కాని చిహ్నాన్ని ఆ రెండు గుర్తుల‌కు ప‌రిమితం చేయ‌డం స‌రికాద‌నే భావ‌న ఉంది.అందుకే చిహ్నాన్ని మ‌రింత విస్త్రుత ప‌రుస్తుంది ప్ర‌భుత్వం.దాంట్లో కూడా రాజ‌కీయం ఎందుకు?

కాక‌తీయ క‌ళాతోర‌ణం, చార్మినార్ అంటే గౌర‌వం ఉంది.కానీ ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌, అది మోసిన బోయీ లెవ్వరు? అనే చ‌రిత్ర మ‌న‌కు ఇప్పుడు కావాలి.వేట‌గాడి చ‌రిత్ర ఒక్క‌టే చ‌రిత్ర కాదు.

గాయ ప‌డ్డ లేడి పిల్ల చ‌రిత్ర కూడా చ‌ద‌వాలి.అందుకే తెలంగాణ కీర్తి, ఆర్తి, పోరాటం, చైత‌న్య ప్ర‌తిక‌ల‌కు చిహ్నంలో స్థానం క‌ల్పిస్తున్నాం.

అధికారం పోయాక కేటీఆర్ కెసిఆర్ తెలంగాణ ప్రజలపై వలకబోస్తున్న ప్రేమను ప్రజలంతా గమనిస్తున్నారు.తెలంగాణ ప్రజలపై ఇంత ప్రేమ వలకబోస్తున్న మీరు అసలు మీ పార్టీ నుండి తెలంగాణ పదం ఎందుకు తీసివేసీ భారత రాష్ట్ర సమితిగా ఎందుకు మార్చారో ప్రజలకు సమాధానం చెప్పాలి.

మీరు మీ పార్టీ నుండి తెలంగాణ పాదం తీసివేసినప్పుడే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగు బంధం తెంపుకున్నారు.అందుకే మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube