అర్హులందరూ ఓటరు గా నమోదు అయ్యేందుకు సహకరించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, నమోదుకు అన్ని రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరిస్తూ పారదర్శక ఓటరు జాబితా తయారీ లో భాగస్వామ్యం కావాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ కోరారు.ఐ డి ఓ సిలోని తన చాంబర్‌లో అదనపు కలెక్టర్‌ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు.

 All Eligible Should Cooperate To Register As A Voter, Voter Register, Addl Colle-TeluguStop.com

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ ఏడాది శాసన సభ ఎన్నికల నిర్వహించాల్సి ఉన్నందు వల్ల రెండో స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌- 2023 పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా మరో షెడ్యూల్‌ను ప్రకటించిందన్నారు.

అక్టోబర్‌ 4వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురణతో ముగియనుందన్నారు.ఇందులో భాగంగా ఇంటింటా సర్వేతోపాటు అర్హులైన వారిని ఓటరుగా నమోదు చేయడం, డబుల్‌ ఓటర్లు, చనిపోయిన వారి తొలగింపునకు దరఖాస్తులను స్వీకరించి సవరణలు చేసి తుది జాబితాను ప్రకటిస్తామన్నారు.

ఒకే రకమైన ఫొటోలు, మరణించిన వారు, ఒకే ఓటరు వేర్వేరు చోట్ల నమోదు వంటి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని అన్నారు.ఈ సమావేశంలో తహశీల్దార్ విజయ్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube