అర్హులందరూ ఓటరు గా నమోదు అయ్యేందుకు సహకరించాలి
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, నమోదుకు అన్ని రాజకీయ పార్టీలు జిల్లా యంత్రాంగానికి సహకరిస్తూ పారదర్శక ఓటరు జాబితా తయారీ లో భాగస్వామ్యం కావాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ కోరారు.
ఐ డి ఓ సిలోని తన చాంబర్‌లో అదనపు కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది శాసన సభ ఎన్నికల నిర్వహించాల్సి ఉన్నందు వల్ల రెండో స్పెషల్ సమ్మరీ రివిజన్- 2023 పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా మరో షెడ్యూల్‌ను ప్రకటించిందన్నారు.
అక్టోబర్ 4వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురణతో ముగియనుందన్నారు.ఇందులో భాగంగా ఇంటింటా సర్వేతోపాటు అర్హులైన వారిని ఓటరుగా నమోదు చేయడం, డబుల్ ఓటర్లు, చనిపోయిన వారి తొలగింపునకు దరఖాస్తులను స్వీకరించి సవరణలు చేసి తుది జాబితాను ప్రకటిస్తామన్నారు.
ఒకే రకమైన ఫొటోలు, మరణించిన వారు, ఒకే ఓటరు వేర్వేరు చోట్ల నమోదు వంటి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని అన్నారు.
ఈ సమావేశంలో తహశీల్దార్ విజయ్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
సాయి పల్లవి కూతురితో సమానం.. అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు!