ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యాబోధన - మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య బోధన అందుతుందని ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు.మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట ప్రభుత్వ పాఠశాలలో కొర్ర రిత్విక యాదవ్,శివరాత్రి రేయాన్ష్ ను ఇద్దరినీ మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ సమక్షంలో పాఠశాలలో చేర్పించారు.

 Quality Education In Government Schools Former Mptc Balaraju Yadav, Quality Edu-TeluguStop.com

ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో అందే విద్యా విధానం పై వారికి అవగాహన కల్పించారు.

రెండవ విడత మన ఊరు మన బడి లో ఇట్టి పాఠశాల పునర్ నిర్మాణం కోసం ఎల్లారెడ్డిపేట కు మంత్రి కెటిఆర్ వచ్చినప్పుడు వినతి పత్రం సమర్పించడం జరిగిందని ఆయన అన్నారు.

దాదాపుగా ఇప్పటి వరకు వివిధ తరగతులలో నూతనంగా సుమారు 30 మంది వరకు ఇట్టి పాఠశాలలో ప్రవేశాలు పొందారని రాబోయే రోజుల్లో ఇంకా ప్రవేశాలు పెంచడానికి గ్రామస్థులు కృషి చేయాలని ఆయన కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube