పోచమ్మ కు మొక్కులు చెల్లించుకున్న రైతులు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల కిష్ఠంపల్లి లో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు అమ్ముకోగా వడ్లు అమ్మిన అనంతరం అక్కడే ఉన్న పోచమ్మ కు నైవేద్యం సమర్పించి ప్రతి ఏటా మొక్కులు చెల్లించుకుంటారు.దాంట్లో భాగంగానే పోచమ్మ కు రైతులు( Farmers ) మొక్కులు చెల్లించగా అన్నదానం కార్యక్రమం ను స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ దంపతులు ప్రారంభించారు.

 Rajanna Sirisilla Farmers Worship To Goddess Pochamma, Goddess Pochamma , Raj-TeluguStop.com

ఈ సందర్భంగా 250 మందికి పైగా రైతులు బోజనాలు చేశారు.ఈ సందర్భంగా వచ్చే వానాకాలం పంటలు సమృద్ధిగా పండాలని పోచమ్మ ను వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి,పి ఎ సి ఎస్ అద్యక్షుడు కృష్ణారెడ్డి,జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు( Laxman Rao ),సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి,బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండారి బాల్ రెడ్డి తో పాటు సొసైటీ వడ్ల సెంటర్ ఇంచార్జీ గుండం సత్యారెడ్డి,రాగుల తిరుపతి రెడ్డి,జవ్వాజి భాస్కర్ తో పాటు రైతులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube