పోచమ్మ కు మొక్కులు చెల్లించుకున్న రైతులు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల కిష్ఠంపల్లి లో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు అమ్ముకోగా వడ్లు అమ్మిన అనంతరం అక్కడే ఉన్న పోచమ్మ కు నైవేద్యం సమర్పించి ప్రతి ఏటా మొక్కులు చెల్లించుకుంటారు.

దాంట్లో భాగంగానే పోచమ్మ కు రైతులు( Farmers ) మొక్కులు చెల్లించగా అన్నదానం కార్యక్రమం ను స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ దంపతులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా 250 మందికి పైగా రైతులు బోజనాలు చేశారు.ఈ సందర్భంగా వచ్చే వానాకాలం పంటలు సమృద్ధిగా పండాలని పోచమ్మ ను వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి,పి ఎ సి ఎస్ అద్యక్షుడు కృష్ణారెడ్డి,జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు( Laxman Rao ),సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి,బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండారి బాల్ రెడ్డి తో పాటు సొసైటీ వడ్ల సెంటర్ ఇంచార్జీ గుండం సత్యారెడ్డి,రాగుల తిరుపతి రెడ్డి,జవ్వాజి భాస్కర్ తో పాటు రైతులు పాల్గొన్నారు.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!