రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సారంపల్లి గ్రామపంచాయతీ సెక్రెటరీకి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని అందించి పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేయించిన నేతలు.ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.
జిల్లా కలెక్టర్ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి చిత్రపటాన్ని ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరిన రాజు.
ఈ కార్యక్రమంలో మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ భరత్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు గుగ్గిల రాములు, మాజీ ఉపసర్పంచ్ పరుశరాములు, మునిగేల అంజయ్య, గంగారం, ఆనందం, దేవరాజు, దేవదాసు తదితరులు పాల్గొన్నారు.