వర్షాధారంగా పండించే పంటలలో కంది పంట( Pigeon Pea Crop ) కూడా ఒకటి.కంది పంటకు దాదాపుగా అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి.
వ్యవసాయానికి పనికిరాని బీడు భూములలో కూడా కంది పంట సాగు చేయవచ్చు.నీటీ వసతులు ఉన్నా లేకున్నా కంది పంట సాగు చేయవచ్చు.
ఇకపోతే నీటి వనరులు ఉంటే ఊహించని అధిక దిగుబడి( High yield ) సాధించవచ్చు.కంది పంటకు పెట్టుబడి వ్యయం కూడా కాస్త తక్కువగానే ఉంటుంది.
కంది పంటను సాగు చేసే నేలను వేసవి కాలంలో లోతు దిక్కులు దున్ని, నేల వదులుగా అయ్యేలాగా రెండు లేదా మూడుసార్లు దమ్ము చేసుకోవాలి.ఒక ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువు, ఎనిమిది కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం వేసుకొని చివరి దమ్ము చేసుకోవాలి.
ఒక ఎకరాకు రెండు కిలోల మేలు రకం తెగులు నిరోధక విత్తనాలు ఎంపిక చేసుకోవాలి.ఒక కిలో విత్తనాలను 5ml ఇమిడాక్లోప్రిడ్ లేదంటే 3గ్రా.థైరం తో విత్తన శుద్ధి చేసుకోవాలి.ఇక మొక్కల మధ్య 25 సెంటీమీటర్లు, మొక్కల వరుసల మధ్య 120 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తనాలకు విత్తుకోవాలి.మొక్కలు ఎక్కువగా ఎత్తు పెరిగితే మొక్కల చివర్లను 30 సెంటీమీటర్ల పొడవు వరకు చివర్లను కత్తిరించి వేయాలి.
విత్తన శుద్ధి చేస్తే నేల నుంచి ఆశించే వివిధ రకాల తెగుళ్ల బెడద కాస్త తక్కువగా ఉంటుంది.అయితే కంది పంటకు చీడపీడల బెడద కాస్త ఎక్కువ.ఆకు చుట్టు పురుగులు కంది పంటను ఆశిస్తే ఊహించని నష్టం ఎదుర్కోవలసి ఉంటుంది.
ఈ ఆకు చుట్టు పురుగులు కంది మొక్క ఆకు యొక్క పత్రహరితాన్ని పీల్చివేస్తాయి.దీంతో మొక్క ఎదుగుదలపై ప్రభావం పడుతుంది.ఈ పురుగులను పొలంలో గుర్తించిన వెంటనే రెండు మిల్లీ లీటర్ల మొనోక్రోటోఫాస్( Monocrotophos ) ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.