జనవరి 5, 6, 7 తేదీలలో 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో 2024 జనవరి 5,6 ,7తేదీలలో “2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించబడుతున్నాయనీ , మాతృభాషా మాధుర్యాన్ని, గొప్పతనాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా 25 సాహిత్య ప్రక్రియలపై సదస్సులుంటాయనీ అధ్యాపకులు,ఉపాధ్యాయులు,భాషాభిమానులు అధికసంఖ్యలో పాల్గొనాలని ప్రచారకార్యదర్శి డా.వాసరవేణి పరశురాం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా సిరిసిల్లలో ప్రచార కార్యదర్శి డా.వాసరవేణి పరశురాం మాట్లాడుతూ ఆధిత్య విద్యాసంస్థలు ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ” మాతృభాష ఉనికి – కర్తవ్యాలు “ సదస్సు నిర్వహించడంతోపాటు వ్యాస సంకలనం ముద్రించబడుతుందనీ కేశిరాజు రాంప్రసాద్ ముఖ్య సంచాలకులుగా, ర్యాలి ప్రసాద్ సంచాలకులుగా వ్యవహరిస్తారనీ తెలిపారు.

 2nd International Telugu Mahasabhalu On 5th 6th And 7th January, Telugu Mahasab-TeluguStop.com

డిసెంబర్ 15లోపు మాతృభాష పై వ్యాసాలు పంపాలన్నారు.“మాతృభాషా పరిరక్షణకు భాషోపాధ్యాయుల కర్తవ్యం”, “మాతృభాషాద్వారా నైతిక విలువల పరిరక్షణ”, “సాంకేతిక పరిజ్ఞానంతో మాతృభాషాభివృద్ధి”, “సాహిత్యం మాతృభాష తులనాత్మకత” మొదలగు అంశాలపై 500ల పదాలతో ఎ4 సైజులో 3 పేజీలు మించకుండా సొంత రచననీ హామీపత్రం, చిరునామా, ఫోటోతో ఈ మెయిల్ aspprasad2k23 @gmail.com కు పంపాలనీ మూడింటికి బహుమతులుంటాయనీ , సంకలనంలో ముద్రించబడుతాయన్నారు.ప్రతినిధులుగా పాల్గొనవచ్చునన్నారు.వివరాలకు 90007 34466, 94945 53425 నెంబర్లను సంప్రదించాలన్నారు.

అనంతరం డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ కవిసమ్మేళనంకు కొల్లూరి సెల్ 9247272066, కథాపఠనంకు రాజేష్ సెల్ 9989723989లకు డిసెంబర్ 15లోగా నమోదు చేసుకోవాలని తెలుగు మహాసభల ను విజయవంతం చేయాలని తెలిపారు.

ఈ సభలలో మిజోరాం గవర్నర్ భాస్కరభట్ల , శ్రీనాథ్ దర్శకులు జనార్ధన్ మహర్షి, విజయేంద్రప్రసాద్ చలనచిత్ర నటులు సాయికుమార్, అలీ, తనికెళ్ళ భరణి, గౌతమ్ రాజు, కంభంపాటి హరిబాబు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి , ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నజీర్, సినీ గేయ రచయితలు చంద్రబోస్, డాక్టర్ గజల్ శ్రీనివాస్, కె.వి.వి సత్యనారాయణరాజు, చక్రావధానుల రెడ్డప్ప, డాక్టర్ కేశరాజు రాంప్రసాద్ , డా.ఎస్.ఆర్.ఎస్ కొల్లూరి, కొత్తగూడెం రాజేష్ గార్లు పాల్గొంటారనీ సుమారు 3000వేల మంది ప్రతినిధులు పాల్గొంటారనీ పరశురాం తెలిపారు.ఈ సమావేశంలో తెలుగు మహాసభల ప్రచారకార్యదర్శి డా.వాసరవేణి పరశురాం, డాక్టర్ జనపాల శంకరయ్య , ముడారి సాయిమహేష్, గుండెల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube