సంస్థాగత ప్రసవాల శాతం పెంచేలా కృషి చేయాలి - జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంస్థాగత ప్రసవాలు పెంచేలా వైద్యారోగ్య సిబ్బంది కృషి చేయాలని, గర్భిణీ స్త్రీలలో హైరిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ బి.

 Efforts Should Be Made To Increase The Percentage Of Institutional Deliveries Di-TeluguStop.com

సత్య ప్రసాద్ తో కలిసి చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాల ప్రగతిని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని సబ్ సెంటర్ ల వారీగా సమీక్ష నిర్వహించారు.ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న 10 సబ్ సెంటర్ల వారీగా గర్భిణీ స్త్రీల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రులలో సంస్థాగత డెలివరీలు, క్షయ వ్యాధి బాధితుల గుర్తింపు, తదితర అంశాలను ఏఎన్ఎం లను అడిగి తెలుసుకున్నారు.

గత నెలలో ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎంత మంది గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించారు అనే వివరాలను కలెక్టర్ ఆరా తీశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏఎన్ఎం లు వారి ఆశా వర్కర్లతో సమన్వయం చేసుకుని క్షేత్ర స్థాయిలో గర్భవతుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

గర్భవతుల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగేలా చూడాలన్నారు.గత నెలలో మొత్తం 61 ప్రసవాలు జరిగాయని, ఈ నెలలో ఇప్పటివరకు 40 ప్రసవాలు జరిగాయని అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.

ముఖ్యంగా హైరిస్క్ కేసులకు అధిక ప్రాధాన్యతనిచ్చి, బాధిత గర్భిణీలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు జిల్లా ఆసుపత్రికి దగ్గరుండి తీసుకురావాలని సూచించారు.రక్తహీనత లోపాన్ని నివారించేందుకు పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకునేలా గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించాలని అన్నారు.

క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి, వారికి అవసరమైన చికిత్స, మందులు అందించాలని ఆదేశించారు.గత నెలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వంద శాతం ప్రసవాలు జరిగేలా కృషి చేసిన సనుగుల, మూడపల్లి సబ్ సెంటర్ల ఏఎన్ఎం లను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.

నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు.పనులు వేగవంతంగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షలో ఎంపీపీ లావణ్య, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.సుమన్ మోహన్ రావు, ఉప వైద్యారోగ్య అధికారులు డా.శ్రీరాములు, డా.రజిత, ఇమ్మ్యూనైజేషన్ అధికారి డా.మహేష్, మెడికల్ ఆఫీసర్ డా.సంపత్, తదితరులు పాల్గొన్నారు.

అనంతరం కలెక్టర్ వేములవాడ గ్రామీణ మండలం హన్మాజీపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.సీఎస్ఆర్ నిధులతో పాటు 5 లక్షల రూపాయలతో ఆరోగ్య కేంద్రంలో నీటి సరఫరా, కాంపౌండ్ వాల్, శానిటరీ, గేట్, తదితర సదుపాయాలు సమకూర్చినట్లు తెలిపారు.

పునరుద్ధరించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని 5 రోజుల్లోగా ప్రారంభానికి సిద్ధం చేయాలని అన్నారు.ఈ సందర్శనలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.సుమన్ మోహన్ రావు, పంచాయితీరాజ్ ఈఈ సూర్య ప్రకాష్, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాంరెడ్డి, మెడికల్ ఆఫీసర్ డా.దివ్యశ్రీ, తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube