రోడ్డు భద్రతా నియమాలను పటిద్దాం - రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం.

జిల్లా కేంద్రంలో విద్యార్థుల చేత రోడ్ భద్రత నియమలపై ఫ్లాష్ మాబ్.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) .

 Let's Follow Road Safety Rules - Avoid Road Accidents , Avoid Road Accidents, Sp-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా లో రోడ్ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్ వద్ద శ్రీ చైతన్య స్కూల్ కి చెందిన విద్యార్థుల నృత్య ప్రదర్శనలు, ట్రాఫిక్ ,రోడ్ ప్రమాదాల నిర్ములనకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేస్తూ రూపొందించిన ప్లాకార్డ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరిని ఆకట్టుకున్నాయి.ఈ ఫ్లాష్ మాబ్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన రోడ్ భద్రత నియమాలకు సంబంధించిన ప్లాకార్డ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి పలువురిని ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింప చేసే విధంగా ఉన్నాయి.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ… ప్రతి వాహన దారుడు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తప్పని సరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, బయటకు వెళ్ళిన తన కోసం కుటుంబ సభ్యులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటరన్న విషయాన్ని వాహన దారులు గుర్తించాలని, అనుకొని ప్రమాదాల వల్ల కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని కావున వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలన్నారు.ప్రతి వాహన దారుడు తప్పకుండా హెల్మెట్, షీట్ బెల్ట్ ధరించాలని , అతి వేగం, ర్యాస్ డ్రైవింగ్, మద్యం త్రాగి డ్రైవింగ్ చేయటం, మొబైల్స్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయటం వంటివి చేయవద్దని,రాంగ్ రూట్ లో వాహనాలు నడుపవద్దని ప్రతి ఒక్కరు విధిగా ట్రాఫిక్ ,రోడ్ భద్రత నియమాలు పాటించాలి అన్నారు.

ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ రఘుపతి, ట్రాఫిక్ ఎస్.ఐ రాజు, సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube