రైతు ఆరు కాలం కష్టపడితే కన్నీళ్లే మిగిలాయి!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అకాల వర్షం కారణంగా రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు పడి అనేక ఎకరాల పంట నేలపాలై రైతులు అగమ్య గోచరంలో రోదిస్తూ వారు పెట్టిన పెట్టుబడి కూడా రాదని కన్నీరు పెడుతున్నారు.కోసిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెట్టుకొని 15 రోజులు అవుతున్నా కూడా అధికారులు వాటిని కొనడం లేదని ఈ వర్షానికి ఉన్న వడ్లు కూడా మొలకలెత్తి కనీస ధర కూడా రాకుండా అవుతుందని మనోవేదనతో మేము చనిపోవాలనుకుంటున్నామని అయినా కూడా ఎవరికి రైతుపై కనికరం రావడంలేదనే చింతతో ఎదురుచూస్తున్న సమయం లో ఈరోజు డాక్టర్ గోలి మోహన్ పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మొలకెత్తిన వడ్లను చూసి చలించిపోయారు.

 If The Farmer Works Hard For Six Years, Only Tears Are Left , Dr. Goli Mohan, Fa-TeluguStop.com

ఒక రైతు కొడుకుగా ఆ బాధ ఎలా ఉంటుందో అది చూసి ప్రతి రైతుకు మనోధైర్యం ఇచ్చేలా ప్రభుత్వానికి విన్నపించారు.ఇప్పటికైనా అధికారులు వీలైనంత త్వరగా కొనుగోలు కేంద్రాల నుండి వడ్లను కొని రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి, మంత్రి కే తారక రామారావు రైతులను ఆదుకొని వారికి మనోధైర్యం ఇవ్వాలని అధికారులకు సత్వరమే ఆదేశాలిచ్చి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లను కొనే లాగా చూడాలని విజ్ఞప్తి చేశారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube