గర్భిణీ స్త్రీలలో వచ్చే మూడు సమస్యలకు పరిష్కారాలు ఇవే..!

ప్రతి మహిళా జీవితంలో మాతృత్వం అనేది ముఖ్యమైన ఘట్టం.గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

 Pregnant Woman Health Care Tips,pregnant Woman,morning Sickness, Vvomitings,high-TeluguStop.com

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు( Pregnant Woman ) ఆహారం విషయంలో, మానసిక ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.మొదటి నెల నుండి డెలివరీ అయ్యేవరకు శరీరంలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి.

అయితే ఈ మార్పులు రావడం వలన మహిళ శరీరంలో కొన్ని హార్మోన్ బ్యాలెన్స్ తప్పే ప్రమాదం కూడా ఉంది.అందుకే వైద్యుల సలహా మేరకు మందులను కచ్చితంగా క్రమం తప్పకుండా వేసుకోవాలి.

ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్( Thyroid Hormone ) చాలా మంది మహిళలలకు సమస్యలు సృష్టిస్తుంది.

Telugu Tips, Heels, Sickness, Pregnant-Telugu Health

గర్భధారణ సమయంలో వచ్చే చాలా మార్పులను ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.గర్భధారణ సమయంలో మొదటి మూడు నెలలపాటు వాంతులు అవుతూ ఉంటాయి.పిండం ఎదిగే క్రమంలో కడుపులో వికారం, వాంతులు అయ్యే అవకాశం ఉంది.

దీంతో చాలా మంది మహిళలు వాంతులు చేసుకుంటూ ఉంటారు.దీన్ని మార్నింగ్ సిక్ నెస్( Morning Sickness ) అని అంటారు.

గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల మార్నింగ్ సిక్ నెస్ వచ్చే అవకాశం ఉంది.అలాగే ఒత్తిడి, ప్రయాణం, వేడి లేదా కొవ్వు పదార్థాలు వంటి నిర్దిష్ట ఆహారాల వల్ల మార్నింగ్ సిక్ నెస్ వస్తుంది.
తరచూ కొంచెం, కొంచెం ఆహారం తీసుకోవడం ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు.అలాగే అధిక ప్రోటీన్, కాంప్లెక్స్, కార్బోహైడ్రేట్ ఆహారం అయినా గోధుమ, రొట్టె, పాస్తా, అరటి పండ్లు, ఆకుకూరలు లాంటివి తింటే వికారం తగ్గించుకోవచ్చు.

చాలామంది మహిళలు వెన్ను నొప్పి( Back pain )తో బాధపడుతూ ఉంటారు.అయితే ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన మీరు బరువు పెరుగుదలను నియంత్రించుకోవచ్చు.

వెన్నునొప్పి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్లు వాడకుండా వీపుపై హీటింగ్ ప్యాడ్ ని ఉపయోగిస్తే నొప్పి నుండి ఉపశమనం ఉంటుంది.

Telugu Tips, Heels, Sickness, Pregnant-Telugu Health

అలాగే హై హీల్స్ చెప్పులు( High Heels ) వాడకుండా ఎక్కువ సేపు నిలబడకుండా ఉండాలి.నిద్రించడానికి కూడా గట్టి పరుపును వాడాలి.గర్భవతిగా ఉన్నప్పుడు చాలామంది మహిళలు తరచూ మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు.

శరీరం అధిక ద్రవాన్ని ఉత్పత్తి చేయడంతో మూత్రపిండాలు( Kidneys ) మరింత ప్రభావంతంగా పనిచేస్తాయి.అందుకే సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన అవుతుంది.అందుకే అటాచ్డ్ బాత్రూం ఉన్న బెడ్ రూమ్లో పడుకునేలా జాగ్రత్త పడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube