ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతున్న బ్యూటీ రష్మిక మందన్న.( Rashmika Mandanna ) ఇప్పుడు ఈ బ్యూటీకి బాగా కలిసి వస్తుంది.
ఎక్కడ చూసినా ఈ బ్యూటీ పేరు బాగా హాట్ టాపిక్ గా మారింది.అతి తక్కువ సమయంలో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న రష్మిక మందన ప్రస్తుతం స్టార్ హీరోల సరసన పాన్ ఇండియా లెవెల్ లో దూసుకెళ్తుంది.
రష్మిక ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంది.తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన గీతగోవిందం, మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో చేసిన భీష్మ ( Bheeshma ) సినిమాలు చేసి స్టార్ స్టేటస్ పట్టేసింది.
అలా వరుసగా మంచి మంచి సక్సెస్ లు అందుకోగా ఇప్పుడు ఎవరికి అందనంత లెవెల్ లో దూసుకెళ్తుంది ఈ కన్నడ బ్యూటీ.

పైగా బాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా వరుస ఆఫర్స్ రావటంతో అక్కడ కూడా చాలా బిజీగా మారింది.దీంతో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.ఇక ఎంత బిజీ లైఫ్ లో ఉన్నప్పటికీ కూడా సోషల్ మీడియా వైపు అప్పుడప్పుడు తొంగి చూస్తూ అందులో బాగా పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది.
కెరీర్ మొదట్లో అంత గ్లామర్ షో చేసినట్లు ఎప్పుడు కనిపించలేదు రష్మిక.

ఇప్పుడు ఈ బ్యూటీ నేషనల్ క్రష్( National Crush ) కావడంతో నేనెందుకు తగ్గాలి అన్నట్లుగా ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తుంది.ఇక ప్రతిరోజు ఫోటోషూట్లు చేయించుకుంటూ వెంటనే వాటిని నెట్టింట్లో పెట్టి బాగా రచ్చ చేస్తుంది.అలా సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఖాళీ సమయం దొరికితే ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటుంది.

అప్పుడప్పుడు సినిమాకు బ్రేక్ దొరికితే చాలు బయట దేశాలలో తిరుగుతూ హల్చల్ చేస్తుంది.ఇక మొత్తానికి ఈ బ్యూటీ కి ఇప్పుడు బాగా కలిసి వచ్చింది.కొత్త హీరోయిన్స్ ఎంత మంది వచ్చినా కూడా ఈ బ్యూటీని మాత్రం అసలు వదలట్లేదు దర్శకనిర్మాతలు.
ఇక ధైర్యం చూసుకునే రష్మిక రోజురోజుకి మరింత పరుగులు తీస్తుంది.
ఇక తాజాగా మరికొన్ని ఫోటో షూట్ లు చేయించుకోగా వాటిని తన ఇన్ స్టా లో పంచుకుంది.
అందులో తను రకరకాల అవుట్ ఫిట్లతో కనిపించింది.ముఖ్యంగా జపానీస్ లుక్ లో హెయిర్ స్టైల్ తో కనిపించింది.
అంతేకాకుండా తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఫిదా చేసింది.ఇక ఆ ఫోటోలు చూసి తన అభిమానులు లైక్స్ కొడుతున్నారు.
ఈ లుక్ లో చాలా అందంగా ఉన్నావు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పాటు మరిన్ని వరుస ప్రాజెక్టులలో బాగా బిజీగా ఉంది.
మొత్తానికి ఈ ముద్దుగుమ్మ హవా ఇప్పుడు బాగా నడుస్తుంది.







