శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఘనంగా భారతీయ భాషా దినోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా :శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ మీడియం లో మహాకవి, స్వాతంత్ర సమరయోధులైన సుబ్రహ్మణ్య భారతి జన్మదినంను పురస్కరించుకొని భారతీయ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని పాఠశాల యాజమాన్యం సుబ్రహ్మణ్య భారతి చిత్రపటానికి పూలమాలవేసి ప్రారంభించారు.

 Indian Language Day Is Celebrated At Sri Saraswati Shishu Mandir High School , S-TeluguStop.com

ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు తమ కవితల ద్వారా పాటల ద్వారా భాష యొక్క గొప్పతనాన్ని చక్కగా వర్ణించారు.కాగా సుబ్రహ్మణ్య భారతి జీవిత చరిత్ర వీడియోను ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించగా తిలకించిన విద్యార్థులు,ఆచార్యులు, పాఠశాల పెద్దలు చాలా భావోద్వేగానికి లోనయ్యారు.

పాఠశాల పెద్దలు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సాహిత్యం, పత్రికల యొక్క ప్రభావం చాలా ఉండేదని, ఆ సాహిత్యము పత్రికా రంగంలో సుబ్రహ్మణ్య భారతి తన రచనలు కవితల ద్వారా ప్రజలను దేశభక్తి వైపు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర వహించారని, వారికి 14 భాషల్లో ప్రావీణ్యం ఉందని మన భారతీయ భాషను గౌరవించినప్పుడే మనం భారతదేశంని గౌరవించినట్లు అవుతుందని సుబ్రమణ్యం భారతి గారు చెప్పేవారని, భారతీయ భాషల గొప్పతనాన్ని తన కవితలు, పాటలు రూపంలో భారతి గారు ప్రజల్లోకి తీసుకెళ్లారని, దేశభక్తి అంటే భౌతిక ఉద్యమాల ద్వారానే కాకుండా కలము ద్వారా కూడా ఉద్యమం నడిపించవచ్చని సుబ్రహ్మణ్య భారతి చూపించారని వివరించారు.వారిని స్ఫూర్తిగా తీసుకొని మన వివిధ ప్రాంతాల మాతృభాషలను అభివృద్ధి చేసుకొని మనకు దేశం పట్ల గల ప్రేమను చూపించాలని కార్యక్రమానికి విచ్చేసిన పాఠశాల పెద్దలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శులు గర్శకుర్తి వెంకటేశ్వర్లు,మోటూరి మధు, పాఠశాల విద్యార్థులు, ఆచార్యులు, పోషకులు పాల్గొన్నారని పాఠశాల ప్రధానాచార్యులు చిలక గట్టు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube