ఐడియా, బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్స్ లోని బ్యాటరీలు దొంగిలించిన 05 గురు అంతర్ జిల్లా దొంగలు అరెస్ట్

ఐడియా, బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్స్ లోని బ్యాటరీలు దొంగిలించిన 05 గురు అంతర్ జిల్లా దొంగలు అరెస్ట్.40,000/-రూపాయలు, రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం.గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ లో అంతర్ జిల్లా దొంగల అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డిపేట్ సి.ఐ శశిధర్ రెడ్డి.నిందుతుల వివరాలు.1.వుడెం అరుణ్ కుమార్ గ్రామం నారాయణపూర్,కామారెడ్డి జిల్లా.2.బోడమీది రవి ,గ్రామం ఆర్మూర్,3.గాయిని మైసయ్య, గ్రామం గాంధారి,4.గులుసు లింగం,గ్రామం గాంధారి.5.కలీం అహ్మద్,కామారెడ్డి.

 05 Inter-district Thieves Arrested For Stealing Batteries From Idea, Bsnl Cell T-TeluguStop.com

ఈ సందర్భంగా సి.ఐ శశిధర్ మాట్లాడుతూ తేదీ: 16-12-2023 రోజున గంభీరావుపేట్ మండల పరిధిలోని ముస్తఫా నగర్ , దమ్మన్నపేట గ్రామాలలో ఉన్న ఐడియా, బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్స్ లోని బ్యాటరీలు దొంగలించబడినవని గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ లో ఐడియా లో పని చేసే కిరణ్,బిఎస్ఎన్ఎల్ పని చేసే ముత్తయ్య ల పిర్యాదు నమోదు కాకా అట్టి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా నమ్మదగిన సమాచారం మేరకు

ఈరోజు మధ్యాహ్నం 10:00 గంటలకు పెద్దమ్మ స్టేజి ప్రాంతంలో వుడెం అరుణ్ కుమార్,బోడమీది రవి,,గాయిని మైసయ్య, గులుసు లింగం లను అరెస్టు చేసి వారిని విచారించగా నారాయణపూర్ గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ గతంలో బిఎస్ఎన్ఎల్ కంపెనీలో సూపర్వైజర్ గా పనిచేసినడని అతను మిగతా నిందితులను కలుపుకొని ఒక ముఠాగా ఏర్పడి దొంగతనానికి పాల్పడినారని తెలిపినారు.వారు దొంగలించిన సొమ్మని కామారెడ్డి గ్రామానికి చెందిన కలీం అహ్మద్ కి అమ్మినారని తెలుపగా కలీం అహ్మద్ ని అరెస్టు చేసి వారి దగ్గరినుండి 40,000/- రూపాయల నగదు రెండు సెల్ఫోన్ లను స్వాధీనపరచుకొని రిమాండ్ కి తరలించడం జరిగింది.

పై నిందితులు గతంలో బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి పాల్పడగా అట్టి దొంగతనానికి సంబంధించి 1,50,000/- రూపాయల నగదు 72 బ్యాటరీలను, ఇట్టి దొంగతనానికి ఉపయోగించిన కారు, ఒక టాటా ఎస్ ఆటో ని పోలీసు వారు స్వాధీన పరచుకున్నారని , వీరు కామారెడ్డి జిల్లాలో దాదాపు పది కేసులలో నిందితులుగా అరెస్టు చేయబడి దొంగతనాలను ఒప్పుకున్నారని, గాంధారి గ్రామానికి చెందిన మరొక నేరస్తుడు మ్యాతరి సాయిలు పరారీలో ఉన్నాడని సాయిలు త్వరలో పట్టుకోవడం జరుగుతుందని ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి తెలిపారు.ఈ మీడియా సమావేశంలో గంభీరావుపేట ఎస్సై బి రామ్మోహన్,సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube