బొప్పాపూర్ గ్రామంలో గ్రంథాలయం ప్రారంభించిన సర్పంచ్

ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి( Boppapur Village Sarpanch Balreddy ) గ్రంథాలయాన్ని ప్రారంభించారు.ఇట్టి గ్రంధాలయానికి ముఖ్యఅతిథిగా జిల్లా గ్రంథాలయం చైర్మన్ ఆకునూరి శంకరయ్య రిబ్బన్ కట్ చేసి గ్రంథాలయాన్ని ప్రారంభించారు.

 Sarpanch Inaugurates Library In Boppapur Village, Boppapur Village, Library,raja-TeluguStop.com

సందర్భంగా ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ.పువ్వు అందంగా ఉన్న వాసన లేకపోతే ఎవరు పట్టించుకోరని, అలాగే మనిషికి చదువు రాకపోతే అతన్ని ఎవరు పట్టించుకోరని పాఠశాలలో చదివే చదువు ఒక మెట్టు, అని గ్రంథాలయాలలో చదివే చదువు మరొక మెట్టు అని మహా మేధావి కావాలి అంటే గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు కచ్చితంగా చదవాలని నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విద్యుత్ దీపాల కింద చదువుకొని అనేక పుస్తకాలు గ్రంథాలయాలలో చదివి మహా మేధావి అయ్యారని ఈరోజు అంబేద్కర్ ను ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని అది కేవలం చదువుతూనే సాధ్యమైందని రానున్న రోజుల్లో ప్రతి గ్రామానికి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తానని బొప్పాపూర్ గ్రామంలో ఉన్న గ్రంధాలాయనికి అవసరమైనన్ని పుస్తకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.

అలాగే బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ కొండాపురం బాల్రెడ్డి గ్రామస్తుల కోరిక మేరకు అహర్నిశలు శ్రమించి ఉన్నతాధికారులతో మాట్లాడి బొప్పాపూర్ గ్రామంలో కూడా గ్రంధాలయం ఉండాలనే ఉద్దేశంతో వారం రోజుల్లో ఈ గ్రంధాలయాన్ని ఏర్పాటు చేశారు సర్పంచ్ కొండాపురం బాల్రెడ్డి మాట్లాడుతూ.

గ్రామస్తులంతా ప్రతిరోజు ఒక గంట కేటాయించి గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు చదివి విజ్ఞానవంతులు కావాలని గ్రంథాలయానికి కావలసిన పుస్తకాలను తమవంతుగా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎం.పీ.డీ.వో బింగి చిరంజీవి,ఎంపీటీసీ ఇల్లెందుల గీతాంజలి-శ్రీనివాస్ రెడ్డి ఉప సర్పంచ్ వంగ హేమలత-బాపురెడ్డి, జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక -కిషన్, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో చైర్మన్ గుండారం కృష్ణారెడ్డి, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, మాజీ ఏ.ఎం.సీ చైర్మన్ నరసింహారెడ్డి, జిల్లా కోఆప్షన్ చాంద్ పాషా, అందే సుభాష్, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు,పాలకవర్గం, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube