వేములవాడ బస్ డిపో కార్మికులు ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం...

ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు.రాజన్న సిరిసిల్ల జిల్లా:నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని నిర్ణయం తీసుకున్నందుకుగాను వేములవాడ( Vemulawada )ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబు ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఆర్టీసీ ఉద్యోగులు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు కావాలి అని కొట్లాడిన నేత కెసిఆర్( CM KCR )రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో భవిష్యత్తులో మంచిగా ఉండాలి అని ముఖ్య ఉద్దేశంతో కాలేశ్వరం ప్రాజెక్టు తీసుకవచ్చి ఒక కోటి ఎకరాల మాగాణి చేసినందుకు గాను నిధుల విషయంలో ఎన్నో వేల కోట్ల నిధులు తీసుకవచ్చి అభివృద్ధి పథంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందంజలో తీసుకపోతున్నారని అన్నారు.

 Vemulawada Bus Depot Workers Paid Homage To The Portrait Of Honorable Chief Mini-TeluguStop.com

నియామకాల విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అనేక నియమాకాలు చేపట్టుకుంటూ ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్ లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని నిన్నటి రోజున కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం గొప్ప చారిత్రాత్మక నిర్ణయమని 70 ఏళ్ళు పాలించినటువంటి ప్రభుత్వాలు చేయలేని విధంగా మరి కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తొమ్మిది సంవత్సరాలలో ఎన్నో ప్రగతులు దాటి అన్నపూర్ణ రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నాలుగో వరుసలో ఉంచిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలలో దేశమే తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని అన్నారు.

మిగతా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని మిగతా రాష్ట్రాల ప్రజలు కెసిఆర్ పాలన కోరుకుంటున్నారని, రానున్న రోజుల్లో వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెంది దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వేములవాడ డిపో మేనేజర్ కి, ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఆర్టీసీ కార్మికులను( RTC workers ) ప్రభుత్వంలో విలీనం చేస్తామని నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రి అజయ్ కుమార్, ఎమ్మెల్యే రమేష్ బాబు కి ఆర్టీసీ కార్మికులకు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మురళి కృష్ణ ,జడ్పిటిసిలు రవి ,సెస్ డైరెక్టర్ హరి చరణ్ రావు ,గౌరవ కౌన్సిలర్లు జోగిని శంకర్ ,నరాల శేఖర్ ,నాయకులు,ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube