రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రభుత్వ దవాఖానాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అంధించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్, ముచ్చర్లలోని ఆరోగ్య సబ్ సెంటర్లను కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సముద్ర లింగాపూర్ వైద్య కేంద్రాం లో ఏర్పాటు చేసిన ప్రత్యేక దంత వైద్య శిమిరము మరియు రోగులకు అందిస్తున్న సేవలు, ఓపీ రిజిస్టర్, మందుల నిల్వలు పరిశీలించారు.
రోగులకు అందిస్తున్న సేవలు, టీకాల పంపిణీ, ఆయా సెంటర్ల పరిధిలో షుగర్, బీపీ, ఎనీమియా, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, గర్భిణులకు పరీక్షలు, కాన్పుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇక్కడ డీఎంహెచ్ఓ డాక్టర్ సుమన్ మోహన్ రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రజిత, ప్రోగ్రాం ఆఫీసర్ ఉమాదేవి, మెడికల్ ఆఫీసర్ వేణుగోపాల్ రావు, ఎంఎల్ హెచ్ పీలు శివాని, వనజ తదితరులు పాల్గొన్నారు.