రాజన్న సిరిసిల్ల జిల్లా: బిఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలను దౌర్జన్యాలను బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి లు తీవ్రంగా ఖండించారు.బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిరిసిల్ల పట్టణంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను అన్యాయంగా దగ్ధం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య మాట్లాడుతూ గత సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్రంలో జిల్లాలో చేస్తున్న అవినీతి ఆక్రమాలను విసిగిపోయి బిఆర్ఎస్ పార్టీని కూల్చివేసి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించుకున్నారని అది జీర్ణించుకోలేక బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కల్లు తాగిన కోతి వలె వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
ప్రజలు తగిన బుద్ధి చెప్పిన ఇంకా వారికి బుద్ధి రాలేదన్నారు.
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ప్రజలకు మంచి విశ్వాసం ఉందని అందుకే కాంగ్రెస్ పార్టీని ప్రజలు అధికారంలోకి తెచ్చారన్నారు.కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విశ్వాసం లేదని ఆయన గుర్తు చేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు ఏలూరి రాజయ్య, మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి , మేడిపల్లి దేవానందం , జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సాహెబ్, మర్రి శ్రీనివాస్ రెడ్డి ,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సూడిద రాజేందర్, మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫీక్ ,
కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గుండాడి రాంరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బానోతు రాజు నాయక్ , పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, గంట బుచ్చా గౌడ్ , కొత్తపల్లి దేవయ్య , గఫర్ బాయి , ఎడ్ల రాజకుమార్ , గుర్రపు రాములు , నంది కిషన్ , దండు శ్రీనివాస్ , భాస్కర్ జాదవ్, ముని సింగ్, పందిరి శ్రీనివాస్ గౌడ్ , పొన్నాల మల్లారెడ్డి, కంచర్ల దేవయ్య , పుల్లయ్య గారి తిరుపతి గౌడ్ , ఆంజనేయులు గౌడ్,రమేష్ గౌడ్ ,ఇమామ్ బాయి , కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖల అధ్యక్షులు సత్యనారాయణ, చెరుకు ఎల్లయ్య యాదవ్ , గుడ్ల శ్రీనివాస్ , రాజయ్య , బాలయ్య ,పొన్నాల తిరుపతిరెడ్డి ,ఉప్పుల రవి, ద్యాగం లక్ష్మీనర్స్ ,గోలిపెళ్లి ప్రతాప్ రెడ్డి , మహేందర్ యాదవ్,సత్తయ్య తదితరులు పాల్గొన్నారు,
.