వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అధికారుల సూచనలు తప్పకుండా పాటిస్తూ ముందుకు వెళ్లాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.ఇల్లంతకుంట మండలం జవారిపేట – నర్సక్కపేట గ్రామాల మధ్యగల బిక్క వాగు, అదే మండలంలోని కందికట్కూరు గ్రామంలో లోలెవల్ వంతెన, జవారిపేట గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో నిలిచిన నీటిని, జవారిపేట- గన్నెరువరం రోడ్డును కలెక్టర్, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు.

 Collector Sandeep Kumar Jha And Sp Akhil Mahajan Visited The Flood Affected Area-TeluguStop.com

జవారిపేట – నర్సక్కపేట రోడ్డు మరమ్మత్తు చేయించాలని, పూర్తి స్థాయిలో నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.జవారిపేట జీపీ వద్ద ఉన్న ఇండ్ల వద్ద నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సెక్రటరీకి సూచించారు.

గంభీరావుపేట మండలం లింగన్నపేట బ్రిడ్జి వద్ద వరద ప్రవాహాన్ని, నర్మాల గ్రామంలోని ఎగువ మానేరు జలాశయాన్నీ కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో సందర్శకులను లోనికి అనుమతించ వద్దని కలెక్టర్ ఆదేశించారు.

జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి,వన్ పల్లి వద్ద లో లెవెల్ వంతెనలు, గర్జనపల్లిలో  ఇల్లు కూలి పోగా, కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.

ఇక్కడ సిరిసిల్ల ఆర్డీవో రమేష్, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఇరిగేషన్ అధికారి అమరేందర్ రెడ్డి, ఆయా మండలాల తహసీల్దార్లు ఎం ఏ ఫారూఖ్, భూపతి, మారుతి రెడ్డి, ఎంపీడీఓ శశికళ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube