ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎస్సై. కదిరే శ్రీకాంత్ గౌడ్.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు సురక్షిత ప్రాంతాలలో ఉండాలని ఎస్సై కదిరే శ్రీకాంత్ గౌడ్ విజ్ఞప్తి చేయడం జరిగింది.ఎస్ఐమాట్లాడుతూ మండల ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చెపుతూ వరదల కారణంగా వాగులుఉదృతంగా ప్రవహిస్తున్న నేపత్యంలో చెరువులు,కుంటలు నిండుతున్నాయి.

 All People Should Be Alert Due To Incessant Rains. Essay Kadire Srikanth Goud ,-TeluguStop.com

అందువలన వరదలు ఎక్కువగా వస్తున్న ,పరిసర ప్రాంతాలను పరిశీలీంచి .కొన్ని గ్రామాల మధ్య రాకపోకలు నిలిపి వేసి రహదారిపై అడ్డుగా ట్రాక్టర్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు.వర్షాలు తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని, రాబోయే రెండు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని తెలిపారు.మండలంలో అన్ని గ్రామాల ప్రజలు వాగు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,సిదిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఎవరు నివాసం ఉండరాదని, నది,పరివాహ ప్రాంతాల్లో మత్స్యకారులు నీటిలోకి ఎవరు వెళ్లొద్దని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

వర్షం కారణంగా విద్యుత్ స్తంభాలు,ట్రాన్స్ పర్మార్లకు షార్ట్ సర్క్యూట్ వచ్చే అవకాశం ఉన్నందున వాటికి దగ్గరగా వెళ్లొద్దని,పశువులను కూడా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఎవరైనా ఆపదలో ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులకు లేదా,డయల్ 100కి ఫోన్ చేస్తే సహాయాన్ని అందిస్తారని, ఆపద సమయంలో మాకు సమాచారమందించి సహకరించాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube