తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు గుర్తుండిపోయే హీరో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అనే చెప్పాలి… ప్రస్తుతం ఆయన సినిమాలు చేయకుండా రాజకీయాల్లో చాలా బిజీగా కొనసాగుతున్నాడు.అయినప్పటికీ సినిమాలను కూడా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈరోజు ఆయన బర్త్ డే సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమాని ( Gabbar Singh movie )రీ రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే…ఇక ఈ సినిమా కోసం అభిమానులు విపరీతంగా ఎదురు చూశారు.ఇక మొత్తానికైతే ఈ సినిమాని ప్రేక్షకులందరూ ఉత్సాహంగా చూస్తూ వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా చేస్తున్నారనే చెప్పాలి.
![Telugu Gabbar Singh, Og, Pawan Kalyan-Telugu Top Posts Telugu Gabbar Singh, Og, Pawan Kalyan-Telugu Top Posts](https://telugustop.com/wp-content/uploads/2024/09/Has-there-been-clarity-on-the-release-of-Pawan-Kalyans-OG-movieb.jpg)
నిజానికి పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటే అదొక పండుగ వాతావరణం నెలకొల్పుతుంది.ఇక రీసెంట్ గా వచ్చిన అన్ని సినిమాల రీ రిలీజ్ లను తల దాన్నెలా గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ ( Gabbar Singh movie re-release )అనేది జరిగింది.ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తొందర్లోనే తన సినిమాలను సెట్స్ మీదకు తీసుకురావడానికి ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు.ఇక సెట్స్ మీద మూడు సినిమాలను పూర్తి చేసి తొందర్లోనే మరొక సినిమాకి కూడా తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు తెలియదు.
![Telugu Gabbar Singh, Og, Pawan Kalyan-Telugu Top Posts Telugu Gabbar Singh, Og, Pawan Kalyan-Telugu Top Posts](https://telugustop.com/wp-content/uploads/2024/09/Has-there-been-clarity-on-the-release-of-Pawan-Kalyans-OG-moviec.jpg)
కానీ పవన్ కళ్యాణ్ అయితే సినిమా ఇండస్ట్రీలో హీరో గా తను బ్యాలెన్స్ ఉంచిన సినిమాలను పూర్తి చేయాలని చూస్తున్నట్టుగా కూడా చాలా రోజుల నుంచి వార్తలైతే వస్తున్నాయి.మరి ఓ జి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిమీద సరైన క్లారిటీ అయితే లేదు.కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఓజీ సినిమాను మార్చ్ లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కొంతమంది తెలియజేస్తున్నారు.
మరి సినిమా మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే తప్ప ఈ సినిమా మీద సరైన క్లారిటీ అయితే రాదు…
.