గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ రోజు వేములవాడ రూరల్ సర్కిల్(Vemulawada Rural ) కార్యక్రమం,రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు, స్టేషన్ రికార్డ్స్ ,వర్టికల్స్ అమలు తీరు,స్టేషన్ లో విధులు నిర్వహించే సిబ్బంది కిట్ ఆర్టికల్స్, పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల సి.డి ఫైల్స్ లను తనిఖీ చేసి సర్కిల్ పరిధిలోస్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న కేసుల వివరాలు సి.

 Visible Policing Should Be Implemented In Villages: District Sp Akhil Mahajan, V-TeluguStop.com

ఐ ,ఎస్.ఐ లను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా ఎస్పీ(SP Akhil Mahajan ) మాట్లాడుతూ….పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.

అధికారులు,సిబ్బందికి అంకితభావంతో విధులను నిర్వర్తించాలన్నారు.

నేరాల నియంత్రణకై పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్( Visible policing ) అమలు చేయాలని,విలేజ్ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని గ్రామాల్లో తరచు పర్యటిస్తూ ప్రజలతో సస్సబంధాలు కలిగి ఉండాలని, గ్రామాలకు సంబంధించిన పూర్తి సమాచారం విపివో ల దగ్గర ఉండాలని ఏదైనా సంఘటనలు జరిగితే వెంటనే ఉన్నత అధికారులకు తెలియజేయాలన్నారు.

బ్లూ కోల్ట్ సిబ్బంది డయల్ 100 కాల్ రాగానే వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని సమస్యలు పరిష్కరించాలని, రాత్రి సమయాల్లో విధులు నిర్వర్తించే బ్లూ కోల్ట్, పెట్రో కార్ సిబ్బంది పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత నేరస్తులు, సస్పెక్ట్ లు, రౌడీ షీటర్లపై నిఘాను ఉంచాలన్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై ,అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచుతూ కట్టడి చేయాలన్నారు.

ఎస్పీ వెంట ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ మారుతి , సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube