గంజాయి నిందుతుడు అరెస్ట్ రిమాండ్ కి తరలింపు.

ఈ సందర్భంగా సి.ఐ (CI Mogili )మాట్లాడుతూ వేములవాడ మండలం జయ్యారం గ్రామనికి చెందిన డప్పుల వంశీ s/o దేవయ్య,23y అను వ్యక్తి ఇంటర్మీడియట్ చదివే సమయంలో గంజాయికు అలవాటు పడి హైదరాబాదు( Hyderabad )లో సినిమాటోగ్రఫీ కోర్సు చేసే సమయంలో జల్సాలకు అలవాటు చేసుకొని అక్కడి నుండి వేములవాడకు వచ్చి అక్కడ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ అతనికి తెలిసిన వ్యక్తుల దగ్గర గంజాయిని కొని అందులో కొంత తాను తాగి మిగిలిన దానిని ఎక్కువ ధరలకు అమ్ముతూ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ముస్తాబాద్( Mustabad) లో గంజాయి కి అలవాటు పడిన వారికి అమ్మలని ముస్తాబద్ కి వస్తున్నాడనే నమ్మదగిన సమాచారం మేరకు ముస్తాబద్ ఎస్ ఐ, సిబ్బంది తో వెళ్లగా ముస్తాబద్ శివారులో AMR ఫంక్షన్ హాల్ వద్ద అనుమానంగా కనిపించగా అట్టి వ్యక్తి ని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అతని వద్ద నుండి 100 గ్రాముల గంజాయి,ఒక యాక్టివా స్కూటీ, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి నేరస్తుడిని రిమాండ్ కు తరలించడం జరిగిందని సి.ఐ తెలిపారు.

 Arrest Of Ganja Suspect Moved To Remand.-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube