అలాంటి వారిని చెప్పు తీసుకుని కొట్టండి.. విశాల్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్!

కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో హీరో విశాల్ ( Vishal )కు మంచి పేరు ఉంది.విశాల్ కెరీర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తుండగా అప్పుడప్పుడూ వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

 Vishal Sensational Comments About Industry Situations Details Inside ,vishal,-TeluguStop.com

విశాల్ తాజాగా అలాంటి వారిని చెప్పు తీసుకుని కొట్టండి అంటూ ఒకింత సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.హేమ కమిటీ రిపోర్ట్(Justice Hema Committee report ) గురించి విశాల్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Telugu Hema Committee, Kollywood, Tollywood, Vishal-Movie

హేమ కమిటీ రిపోర్ట్( Hema Committee Report ) లోని విషయాలను చదివి నేను షాక్ అయ్యానని విషయాలు తెలిపారు.మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవడం ఎంతో బాధాకరమని విశాల్ పేర్కొన్నారు.తమ సినిమాలలో ఆఫర్లు ఇస్తామని చెప్పి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే వాళ్లకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఉందని విశాల్ వెల్లడించారు.మహిళలు తమకు అలాంటి పరిస్థితులు ఎదురైనా సమయంలో ధైర్యంగా స్పందించాల్సిన అవసరం ఉందని విశాల్ పేర్కొన్నారు.

సినిమాలలో ఆఫర్లు ఇస్తామని చెప్పి మాకు కొన్ని ఫేవర్స్ చేయాలని ఎవరైనా అడిగితే వాళ్ల చెంప చెల్లుమనిపించాలని చెప్పుతో కొట్టాలని విశాల్ అభిప్రాయపడ్డారు.

Telugu Hema Committee, Kollywood, Tollywood, Vishal-Movie

కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది మహిళలకు సైతం ఈ తరహా అనుభవాలు ఎదురయ్యాయని కొన్ని నకిలీ నిర్మాణ సంస్థలు మహిళలను ఈ తరహా ఇబ్బందులకు గురి చేసినట్లు సమాచారం అందిందని విశాల్ వెల్లడించారు.కోలీవుడ్ సినిమా( Kollywood ) ఇండస్ట్రీలో సైతం హేమ తరహా కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఎందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని విశాల్ పేర్కొన్నారు.ఈరోజు విశాల్ పుట్టినరోజు కాగా విశాల్ 48వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.

క్లాస్ సినిమాల కంటే మాస్ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్న విశాల్ సక్సెస్ ఫెయిల్యూర్ కు అతీతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.విశాల్ కు కెరీర్ పరంగా భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube