మ‌నం రోజుకు ఎన్ని గుడ్లు తినాలి? ఎక్కువ గుడ్లు తింటే ఏమ‌వుతుంది?

గుడ్లు పోషకాహారం. మ‌న శరీరానికి కావల్సిన అన్ని పోషకాలు దీనిలో ఉంటాయి.

 How Many Eggs We Should Consume Benefits Usage Every Day Details, Eggs, Consumin-TeluguStop.com

ఇందులో ప్రొటీన్లు, విటమిన్ బి12, విటమిన్ డి మరియు ఇతర యాంటీ ఆక్సైడ్‌లు ఉన్నాయి, ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేస్తాయి.

అయితే మీరు రోజులో ఎక్కువ గుడ్లు తీసుకుంటే అది మీ ఆరోగ్యానికి ఎందుకు మంచిదికాదో ఇప్పుడు తెలుసుకుందాం.గుడ్లు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.

ఎందుకంటే గుడ్డు మధ్య భాగంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది.

ఒక గుడ్డు పచ్చసొనలో దాదాపు 200 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది.

ప్రతిరోజూ 300 మిల్లీగ్రాముల‌ కంటే ఎక్కువ కొలెస్ట్రాల్ తీసుకోవడం మంచిది కాదు.సగటు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి వారానికి 7 గుడ్లు తినవచ్చు, అయితే మీకు ఆరోగ్య సంబంధిత సమస్యలు లేక‌పోతే రోజుకు మూడు గుడ్లు తినవచ్చు.

వేసవిలో గుడ్లు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది.దీని వల్ల ముఖ్యంగా పిల్లల్లో డయేరియా సమస్య కూడా రావచ్చు.కాబట్టి మనం గుడ్లు తిన‌డాన్ని అదుపులో పెట్టుకోవాలి.ఎక్కువ గుడ్లు తినడం ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube