మహిళలు, యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా పోలీస్ లను సంప్రదించండి.

రాజన్న సిరిసిల్ల జిల్లా: విద్యార్థినులు, మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ) భరోసా ఇచ్చారు.జిల్లాలో షీ టీమ్స్ బృందాల ద్వారా కళాశాలలో, పాఠశాలల్లో, విద్యార్థిని విద్యార్థులకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.

 Women And Young Women Who Have Any Problem Contact The Police Without Fear., Wo-TeluguStop.com

ఆగస్ట్ నెలలో షీ టీమ్ కు వచ్చిన ఫిర్యాదులలో 05 ఎఫ్ఐఆర్ లు, 08 పెట్టి కేసులు నమోదు చేసి మహిళలను, విద్యార్థినులను వేధిస్తున్న వారిని గుర్తించి వారియొక్క తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు చిన్న పిల్లల రక్షణ విషయంలో జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు.

మహిళలపై జరుగు నేరాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని మహిళల భద్రత, ఆకతాయిల వేధింపుల నుండి మహిళల రక్షణ కొరకు పోలీస్ శాఖ( Police Department ) అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.

పోలీస్ శాఖ మహిళా భద్రతకు కొరకు జిల్లా వ్యాప్తంగా షి టీమ్స్( SHE Teams ) ఏర్పాటు చేసి ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థినీలు, యువతులు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటున్నదని చెప్పారు.

మహిళలు ముఖ్యంగా సామాజిక మధ్యమాలైన ఫేస్ బుక్, వాట్స్ అప్, ఇన్ స్టాగ్రామ్ ల వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని , ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసే సమయంలో, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎవరైనా ఆకతయులు మహిళలను, యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని రానున్న గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల వద్ద మహిళలకు ఇబ్బందులు కలుగజేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

మహిళలు, యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా జిల్లా షీ టీమ్ ని సంప్రదించాలని, నేరుగా సంప్రదించలేని వారు షీ టీమ్ నంబర్ 87126 56425 డయల్ 100 కు సమాచారం ఇవ్వగలరు మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచడతాయని ఎస్పీ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube