భూకబ్జాలకి పాల్పడిన పెద్దూర్ తిరుపతి అనే వ్యక్తి పై కేసు నమోదు రిమాండ్ కి తరలింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా: అమాయక ప్రజల బెదిరింపులకు గురి చేసి వారి భూములను కబ్జాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అన్నారు.ఈ సందర్బంగా ఎస్పీ( SP Akhil Mahajan ) మాట్లాడుతూ…తంగళ్ళపల్లి మండలానికి చెందిన గజభింకర రాధాబాయీ భర్త బాలాజి 1996 సంవత్సరంలో భూమి కొని రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇటీవల తంగళ్లపల్లి( Thangallapalli) కి చెందిన పెద్దూరు తిరుపతి అనే వ్యక్తి రాధాబాయీ కి చెందిన 20 గుంటలు భూమిని బెదిరించి ఆక్రమించుకున్నాడు.

 The Case Against Peddur Tirupati, Who Was Involved In Land Grabbing, Has Been Mo-TeluguStop.com

రాధా భాయ్ ఇచ్చిన పిర్యాదూ మేరకు పెద్దూరు తిరుపతి మీద తంగళ్ళపల్లి పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం రోజున రిమాండ్ కి తరలించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

జిల్లా పరిధిలో భూ కబ్జాలకి సంబంధించిన, నకిలీ భూ పత్రాలు ( Fake land documents )సృష్టించి బేధరింపులకు పాల్పడిన వారి వివరాలు , నెరప్రవృతి గురించి నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి పిర్యాదు చేయవచ్చు అని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అమాయక ప్రజలను బెదిరిస్తూ, బయబ్రాంతులకు గురి చేస్తూ కబ్జాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు అని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube