స్పష్టమైన ఓటరు జాబితా తయారీలో బూత్ స్థాయి అధికారులదే కీలక పాత్ర - జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఓటర్ల జాబితా నవీకరణ, సవరణలో బూత్ స్థాయి అధికారులదే కీలక పాత్ర అని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని పంచాయితీ రాజ్ గెస్ట్ హౌజ్ లో సిరిసిల్ల లోని బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి అధికారుల సూపర్ వైజర్ లకు అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ (ఏఎల్ఎంటి) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

 Booth Level Officials Play A Vital Role In Preparing A Clear Voter List - Distri-TeluguStop.com

ఈ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి పాల్గొని ప్రసంగించారు.ఎన్నికలు సజావుగా, నిష్ఫక్షపాతంగా నిర్వహించడానికి తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించుకోవడం చాలా అవసరమన్నారు.

ఇందుకు బూత్‌ స్థా యిలో బీఎల్‌వోలది కీలకపాత్ర ఉంటుందని, ఇంటింటికి తిరిగి పూర్తి వివరాలు తగిన ఆధారాలతో సేకరించాలన్నారు.అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలన్నారు.

ప్రస్తుతం చేపడుతున్న స్పెషల్‌ సమ్మరి రివిజన్‌- 2 ప్రకారం నూతనంగా వచ్చిన నిబంధనలు, మార్పులు, సడలింపులపై బీఎల్‌వోల లు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.ముఖ్యంగా ఫారం 6, 7, 8 పై పూర్తి అవగాహన పెంపొదించుకోవాలన్నారు.

నియోజకవర్గ ట్రైనర్లకు శిక్షణ పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే ట్రైనర్ లను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు.

వేములవాడ పరిధిలో వేములవాడ బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి అధికారుల సూపర్ వైజర్ లకుచందుర్తి మండల కేంద్రం లో చందుర్తి, రుద్రంగి మండలాల బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి అధికారుల సూపర్ వైజర్ లకు నిర్వహించి శిక్షణ కార్యక్రమం కు జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ హాజరయ్యారు.శిక్షణ కార్యక్రమంలో ఆర్డీఓ లు టి.శ్రీనివాస రావు, పవన్ కుమార్, సంబంధిత మండలాల తహశీల్దార్ లు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube