ప్రభాస్ ఫస్ట్ లుక్ డిలీట్.. ప్రాజెక్ట్ కే కొత్త పోస్టర్ పై అభిమానుల రియాక్షన్ ఇదే!

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్( Nag Ashwin ) డైరెక్షన్ లో తెరకెక్కి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ప్రాజెక్ట్ కే సినిమాపై భారీగా అంచనాలు నెలకొనగా తాజాగా విడుదలైన ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ పోస్టర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రేక్షకులను మెప్పించే విషయంలో నాగ్ అశ్విన్ ఫెయిల్ అయ్యాడని కామెంట్లు వినిపించాయి.

 Prabhas Project K Shocking Updates Details Here Goes Viral In Social Media , Pr-TeluguStop.com

అయితే పోస్టర్ విషయంలో నెగిటివిటీ మరీ ఎక్కువగా ఉండటంతో మేకర్స్ ఈ పోస్టర్ ను డిలీట్ చేశారు.

Telugu Kamal Haasan, Nag Ashwin, Prabhas, Project, Tollywood-Movie

కొన్ని మార్పులతో ప్రాజెక్ట్ కే సినిమాకు సంబంధించి మరో పోస్టర్ ( poster )ను మేకర్స్ రిలీజ్ చేశారు.అయితే కొత్తగా రిలీజ్ చేసిన పోస్టర్ బాగానే ఉంది కానీ మరీ అద్భుతంగా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.రాబోయే రోజుల్లో వచ్చే ప్రాజెక్ట్ కే సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ విషయంలో మేకర్స్ జాగ్రత్తగా ఉండాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విమర్శలకు ఛాన్స్ ఇవ్వకుండా మేకర్స్ వ్యవహరించాల్సి ఉంది.

Telugu Kamal Haasan, Nag Ashwin, Prabhas, Project, Tollywood-Movie

ప్రాజెక్ట్ కే( project k ) అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ కావడంతో ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తే మాత్రమే నిర్మాతలకు ప్రయోజనం చేకూరుతుంది.ప్రాజెక్ట్ కే సినిమా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చేలా ఉండనుందని తెలుస్తోంది.ఈ సినిమా కథ సైతం కొత్తగా ఉండనుందని ఊహలకు అందని విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం అందుతోంది.

ప్రాజెక్ట్ కే సినిమా 2024 జనవరిలో రిలీజ్ కానుండగా మరికొన్ని గంటల్లో ప్రాజెక్ట్ కే సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్స్ రానున్నాయి.ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమా రిలీజ్ కు ముందు రిలీజ్ తర్వాత సరికొత్త రికార్డులను, సంచలన రికార్డులను సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube