రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) తంగళ్ళపల్లి మండలం గండిలచ్చపేట గ్రామానికి చెందిన రైతు కుర్ర కనుకయ్య తన స్వంత పొలంలో పెంచుకున్న టేకు కలపను తన ఇంటి నిర్మాణంలో భాగంగా ఇంటి తలుపుల (దర్వాజ) తయారీ కోసం ట్రాక్టర్ లో నింపి తన కొడుకు, డ్రైవర్ తో కలసి తంగళ్ళపల్లి లోని కట్టె కొత్త మిషన్ కి తీసుకువెలుతుండగా తంగళ్ళపల్లి కి చెందిన ఇద్దరు రిపోర్టర్లు ట్రాక్టర్ ను మార్గ మధ్యలో మండేపల్లి కమాన్ వద్ద రైతును( Farmer ) అట్టి ట్రాక్టర్ ను ఆపి వీడియోలు, ఫోటోలు తీసి 50,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
డబ్బులు ఇవ్వకపోతే ఫారెస్ట్ అధికారులకు ఫోటోలు, వీడియోలు పంపించి సమాచారం అందిస్తామని అని బెదిరించగా, ఆ రైతు ఇవ్వను అని చెప్పగా ఆ ఇద్దరు వ్యక్తులు ఫొటోలు, వీడియోలు తీసి పలు సామాజిక మాధ్యమాల్లో అక్రమ కలప రవాణా అని, దీనికి అధికారులు సహకరిస్తున్నారని, ప్రజలను,అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించారు.
సంబంధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ అనంతరం వారిద్దరిని కోర్ట్ లో హజారు పర్చడం జరిగింది అని తంగళ్ళపల్లి ఎస్.ఐ లక్ష్మారెడ్డి ( SI Lakshmareddy )తెలిపారు.
రిపోర్టర్ల ముసుగులో డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో ఎవరినైనా రిపోర్టర్ల ముసుగులో డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులు పెడితే సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఎస్.ఐ గారు ఈ సందర్భంగా తెలిపారు.