శ్రీ సీతారామచంద్రస్వాముల వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

రామరాజ్యం తరహాలోని ప్రజారాజ్య పాలన వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి లో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి( Shri Sitaramachandra Swamy ) వారాలను మాఘ అమావాస్య పర్వదినం సందర్భంగా శుక్రవారం ఉదయం ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు.ఆయన ఆలయం వద్దకు చేరుకోగానే అనుబంధ దేవాలయాల సూపరింటెండెంట్ శ్రీరాములు, గోలి శ్రీనివాస్, ఆలయ అర్చకులు ఆయనకు ఎదురేగి పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు.

 Government Whip Who Visited Mr. Sitaramachandraswamula , Mr. Sitaramachandraswam-TeluguStop.com

అనంతరం ప్రధాన ఆలయంలో కొలువుదీరిన శ్రీ సీతారామచంద్ర స్వామివారలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం.

ఆనాటి రామరాజ్యాన్ని తలపించే విధంగా ప్రజారాజ్య పరిపాలన చేస్తామని చెప్పారు.కోనరావుపేట మండలం మామిడిపల్లిలో మాఘ అమావాస్య జాతర సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారల దర్శనం అనంతరం ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో సంపదను పెంచుతాం… ఆ సంపదను ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందిస్తామన్నారు.దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా బలాన్ని ఇవ్వాలని శ్రీరామచంద్ర ప్రభువును కోరానని ఆయన తెలిపారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube