Laptop : కొత్త ల్యాప్ టాప్ కొనుగోలు చేస్తున్నారా.. ఎస్ఎస్ డీ , హెచ్ డీడీ మధ్య తేడా ఏంటో తెలుసా..?

ఇటీవలే కాలంలో ల్యాప్ టాప్( Laptop ) ఉపయోగించిన యువత చాలా అరుదు.దాదాపుగా ప్రతి ఇంట్లో ల్యాప్ టాప్ తప్పనిసరిగా ఉంటుంది.

 Are You Buying A New Laptop Do You Know The Difference Between Ssd And Hdd-TeluguStop.com

మార్కెట్లో సరికొత్త టెక్నాలజీతో ఎలక్ట్రానిక్ వస్తువులు రావడం పరిపాటి.అయితే ల్యాప్ టాప్ కొనుగోలు చేసేందుకు ముందు స్టోరేజ్ కు సంబంధించిన సమాచారం గురించి కచ్చితంగా తెలుసుకుంటారు.

కొత్త ల్యాప్ టాప్ కొనేముందు ప్రతి ఒక్కరూ ఎస్ఎస్ డీ, హెచ్ డీడీ ( SSD, HDD )మధ్య తేడా ఏందో తెలుసుకోకపోతే చాలా నష్టపోవాల్సి ఉంటుంది.ఇవి మన బడ్జెట్ ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

కాబట్టి ల్యాప్ టాప్ కొనేముందు వీటి గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.

హెచ్ డీడీ అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్( Hard disk drive ).హెచ్ డీడీ ల్యాప్ టాప్ లు తక్కువ ఆపరేటింగ్, బూటింగ్ వేగాన్ని కలిగి ఉంటాయి.ఈ హెచ్ డీడీ ల్యాప్ టాప్ లు మెకానికల్ మోడ్ ఆధారంగా పనిచేస్తాయి.

ఈ ల్యాప్ టాప్ లు ఆన్ లో ఉన్నపుడు తులనాత్మకంగా ధ్వనిస్తూ ఉంటాయి.చవకైన బడ్జెట్లో వ్యక్తిగత అవసరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ఎస్ఎస్ డీ అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్.( Solid state drive ) ఎస్ఎస్ డీ ల్యాప్ టాప్ లు చాలా వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తాయి.హెచ్ డీడీ ల్యాప్ టాప్ లతో పోలిస్తే ఎస్ఎస్ డీ ల్యాప్ టాప్ లు చాలా ఖరీదైనవి.ఎస్ఎస్ డీ ల్యాప్ టాప్ లు నాన్-మెకానికల్ ఫ్లాష్ మెకానిజం పై పని చేస్తాయి.

ఈ ల్యాప్ టాప్ లు నిపుణులు, గేమర్లకు చాలా అనువుగా ఉంటాయి.ఈ ల్యాప్ టాప్ లు సాపేక్షంగా నిశ్శబ్దంగా ఉంటాయి.ఇవి ఎక్కువ శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉండడంతో పాటు సుదీర్ఘ బ్యాటరీ జీవితాన్ని అందిస్తాయి.హెచ్ డీడీ ల్యాప్ టాప్ లతో పోలిస్తే ఎస్ఎస్ డీ ల్యాప్ టాప్ లు పనిచేయడానికి తక్కువ శక్తి అవసరం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube