నేడు దసరా సందర్భంగా వేములవాడ సబ్ డివిజన్ ప్రాంత ప్రజలకు పోలీస్ వారి హెచ్చరికలు జారీ!

వేడుకల్లో పాత కక్షలు గుర్తుపెట్టుకొని అల్లర్లు, దాడులకు పాల్పడటం కావల్సుకొని వ్యక్తుల మధ్య గొడవలు సృష్టిస్తే.కఠిన చర్యలు తీసుకుంటాం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల పోలీస్ వారి నియమ నిబంధనలు పాటించాలని, డీజె ధ్వనితో ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు దసరా ( Dussehra )వేడుకలను అత్యంత ప్రశాంతంగా జరుపుకొని పోలీసులకు సహకరించాలిమీడియా తో వేములవాడ సబ్ డివిజన్ డిఎస్పి నాగేంద్ర చారి( DSP Nagendra Chari )!రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సబ్ డివిజన్ ప్రజలకు డి.

 On The Occasion Of Dussehra Today, The Police Have Issued Warnings To The People-TeluguStop.com

ఎస్.పి నాగేంద్ర చారి ప్రత్యేక దసరా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగ డీఎస్పీ నాగేంద్ర చారి మీడియా తో మాట్లాడుతు చెడుపైమంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటారని, చెడు ఎంత దుర్మార్గమైనదైనా ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని డివిజన్ ప్రాంత ప్రజలకు అయన దసరా విశిష్టతను తెలియజేశారు.పండుగ సందర్భంగా అత్యుత్సాహంతో పిల్లలకు వాహనాలు ఇవ్వడం వల్ల ఏదైనా జరగరాని ప్రమాదం జరగవచ్చు కాబట్టి తల్లిదండ్రులే పిల్లలకు వాహనాలు ఇవ్వడంపై బాధ్యత వహించాలని సూచించారు.

ఎవరు కూడా మద్యం తాగి వాహనాలు నడపి ప్రమాదాలకు గురికావద్దని కోరారు.దసరా రోజు ఏమైనా నేరాలు చేస్తే కేసులు ఉండవనే అపోహ కొంతమందికి ఉందని కానీ అలాంటిది ఏమీ ఉండదని చట్ట ప్రకారం అలాంటి వారిపై ఇంకా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆధ్యాత్మికమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా పండుగను జరుపుకోవాలని తెలిపారు.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ప్రజలందరూ పోలీస్ నియమ నిబంధనలు పాటించి పోలీస్ యంత్రాంగానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని, డీజెలు పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించకూడదని, అలా ప్రమాదకరమైనటువంటి ధ్వనితో ఇబ్బంది కలిగిస్తే డీజెలను సీజ్ చేస్తామన్నారు.

చెరువులు కుంటలు నిండుకుండలా ప్రస్తుతం ఉండటం వల్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 ను సంప్రదించాలని డీఎస్పీ కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube