ప్రభుత్వ విద్యను ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తాం - ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా: కీ.శే.

 Mla Adi Srinivas About Strengthening Govt Education, Mla Adi Srinivas , Govt Edu-TeluguStop.com

మంకు రాజయ్య స్మారకార్థం నిర్వహిస్తున్న టీచర్స్ ప్రీమియర్ లీగ్ మూడవ సీజన్ సంబంధించి సిరిసిల్లలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ పాల్గొని ప్రభుత్వ ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని వివరిస్తూ మాట్లాడారు.ప్రభుత్వం ఉపాధ్యాయుల పక్షాన ఉంటుందని ఉపాధ్యాయ సమస్యల పట్ల సానుకూలంగా పరిష్కరించే విధంగా ప్రభుత్వ విధానాలు ఉంటాయని ప్రతినెలా జీతాలు మొదటి వారంలోని ఉపాధ్యాయులందరికీ జమ అవుతాయనీ, 317 జీవో ద్వారా ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులందరికీ న్యాయం చేసే విధంగా తగు పరిష్కారాన్ని రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ సంఘం నాయకులు తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలతో ఉన్న సమస్యల గురించి జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లతో వారం రోజుల్లో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారని అన్ని సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని పరిష్కారం దిశగా కృషి చేస్తానని తెలిపారు.

మంకు రాజయ్య సేవలు చిరస్మరణీయమని వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆ దిశగా ప్రభుత్వ పాఠశాలను మరింత బలోపేతం చేస్తూ ప్రతి గ్రామంలో ఒక పాఠశాల కచ్చితంగా ఉండే విధంగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని, అందరికీ ఉచిత విద్య నాణ్యమైన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, టీచర్స్ ప్రీమియర్ లీగ్ జిల్లా అధ్యక్షులు జక్కని నవీన్, గౌరవాధ్యక్షులు శర్మన్ నాయక్ , భాస్కర్ రెడ్డి, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు లెంకల జయకృష్ణ, కొండికొప్పుల రవి, స్టాలిన్, వంగ తిరుపతి, దూస సంతోష్,గుండెల్లి రవీందర్, మల్లికార్జున్ సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ , స్థానిక కౌన్సిలర్లు నాగరాజు , కల్లూరి మధు గారు రెడ్యా నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ , ఆకునూరి బాలరాజు, యేల్ల లక్ష్మినారాయణ , సత్యనారాయణ గౌడ్ , సూర దేవరాజు, కాముని వనిత, ఉపాధ్యాయ సంఘాల జిల్లా బాధ్యులు, మంకు రాజయ్య సార్ అభిమానులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube