జిల్లా గ్రంధాలయంలో షీ టీమ్ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అదేశాల మేరకు జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంధాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు షీ టీమ్ ఉపయోగాలు, సైబర్ నేరాలపైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.షీ టీమ్ ఎ.

 Awareness Conference Under The Leadership Of She Team At The District Library ,-TeluguStop.com

ఎస్.ఐ ప్రేమ్ దీప్ మాట్లాడుతూ.విద్యార్థులు,యువతి యువకులు సైబర్ క్రైమ్ బారిన పడకుండా, అందరికి సైబర్ క్రైమ్ పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.మిత్రులకు, కుటుంబ సభ్యులకు,సైబర్ క్రైమ్ బారిన పడకుండా అవగాహన కల్పించాలని తెలియజేశారు.

మీరు సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మోసపోయినట్లుగా గుర్తిస్తే తక్షణమే 1930 టోల్ ఫ్రీ నంబర్ కు,డయల్ 100 కి సమాచారం అందిస్తే వీలైనంత వరకు మీ డబ్బులు మీకు వస్తాయి అన్నారు.మహిళలు,విద్యార్థినులు ఆపద సమయంలో డయల్100,జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 లేదా ద్వారా పిర్యాదు చేయవచ్చు.

ఎలాంటి వేధింపులకి గురైనా అమ్మాయిలు మౌనంగా భరించవద్దని,దైర్యంగా ముందుకి వచ్చి షీ టీం ని సంప్రదించాలని కోరారు.జిల్లాలో మహిళలు బాలికలు విద్యార్థినిలు షీటీమ్స్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు.నేటి కాలంలో బాల బాలికలపై మహిళలాలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలని,ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో ఏదైనా సమస్యను మౌనంగా భరించ కుండా ముందుకు వచ్చి షీ టీమ్ ని సంప్రదించి వారి సమస్యలను పరిష్కరించుకొవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, షీ టీమ్ సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube