రాజన్న సిరిసిల్ల జిల్లా : కుల సంఘా భవన నిర్మాణము కొరకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆదివారం బోయినిపల్లి మండలం స్తంభంపల్లి రెడ్డి సంఘం కులస్తులు సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి కరుణాకర్ తో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.
స్తంభంపల్లి లో దాదాపు 300 వందల రెడ్డి కుటుంబాలు ఉన్నాయని కుల సంఘాము మీటింగులు పెట్టుకోడానికి, వ్యవసాయం కోసం చర్చించడానికి భవనం లేనందున చెట్ల కింద సమావేశాలు నిర్వహించుకుంటున్నామని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి సహకరించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో ఎంపిటిసి అక్కనపల్లి ఉపేందర్ రెడ్డి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.