గత కొన్నాళ్లుగా ఇంటర్నెట్ ప్రపంచంలో విరివిగా వినబడుతున్న పేరు చాట్‌జీపీటీ.( ChatGPT ) ఈ ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్‌కి తామేమీ తక్కువ కాదంటూ చాట్‌జీపీటీకి పోటీగా బార్డ్ ( Google Bard ) పేరిట గూగుల్ తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసినదే.ఇలా హుటాహుటిన వచ్చిన చాట్‌బాట్ షాకులమీద షాకులు ఇస్తోంది.ఇప్పటికే ప్రమోషనల్ వీడియోలో జరిగిన తప్పిదంతో గూగుల్( Google ) భారీగా నష్టపోగా తాజాగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక బార్డ్ మరోసారి చతికిలపడింది.
దాంతో ‘బార్డ్’ పనితీరు మరోసారి వార్తల్లో నిలిచింది.
విషయంలోకి వెళితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో బార్డ్‌ను పరిచయం చేస్తూ గూగుల్ ఓ ప్రమోషనల్ వీడియోను వదలగా ఆ వీడియోలో అడిగిన ప్రశ్నకు బార్డ్ సరైన సమాధానం ఇవ్వడంలో పూర్తిగా ఫెయిల్ అయింది.దీంతో గూగుల్‌కు 100 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని భోగట్టా.ఈ క్రమంలోనే తాజాగా టెస్టింగ్ దశలో ఉన్న బార్డ్ శాట్ పరీక్షలకు కూడా సరిగ్గా సమాధానం చెప్పలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇకపోతే అమెరికాకు చెందిన కాలేజీల్లో అడ్మిషన్ పొందాలంటే శాట్ అనే ఎగ్జామ్ రాయాల్సి వుంటుందనే విషయం తెలిసినదే.కాగా ఫార్చ్యూన్ సంస్థ ఆ పరీక్షకు సంబంధించిన మ్యాథ్స్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని బార్డ్‌ను అడగగా బార్డ్ దానికి స్పందించింది.కానీ 75 శాతం మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు తప్పుగా సమాధారణలు ఇచ్చింది.కొన్నింటికి సమాధానాలు ఇచ్చినప్పటికీ.మళ్లీ అదే ప్రశ్న వేసినప్పుడు గతంలో ఇచ్చిన సమాధానం కాకుండా వేరే ఆన్సర్ ఇచ్చినట్లు తేలింది.ఇక రిటర్న్ లాంగ్వేజ్ ఎగ్జామ్‌లో 30 శాతం మాత్రమే కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చింది.
అయితే దీనిపై గూగుల్ ప్రతినిధి ఫార్చ్యూన్‌తో మాట్లాడుతూ.బార్డ్ ఇంకా టెస్టింగ్ దశలో ఉందని చెప్పుకు రావడం కొసమెరుపు.